ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యం(Vontimitta Sri Kodanda Rama temple)లో ఏప్రిల్ 17వ తేదీ నుంచి 25 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 22వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కళ్యాణం(Seeta Rama Kalyanam) జరుగుతుంది. ఏప్రిల్ 16వ తేదీన అంకురార్ప‌ణ‌, ఏప్రిల్ 17వ తేదీన‌ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 20వ తేదీన హనుమంత వాహనం, ఏప్రిల్ 21వ తేదీన గరుడవాహనం, ఏప్రిల్ 22వ తేదీన […]

ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యం(Vontimitta Sri Kodanda Rama temple)లో ఏప్రిల్ 17వ తేదీ నుంచి 25 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 22వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కళ్యాణం(Seeta Rama Kalyanam) జరుగుతుంది. ఏప్రిల్ 16వ తేదీన అంకురార్ప‌ణ‌, ఏప్రిల్ 17వ తేదీన‌ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 20వ తేదీన హనుమంత వాహనం, ఏప్రిల్ 21వ తేదీన గరుడవాహనం, ఏప్రిల్ 22వ తేదీన సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు ఆలయ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఏప్రిల్ 23న రథోత్సవము, ఏప్రిల్ 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగము జరుగుతాయన్నారు. సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ,జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ విజయరామరాజు అన్నారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, సైన్ బోర్డులు, పారిశుధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టం త‌దిత‌ర విభాగాల‌పై సమీక్షించి ఆయన పలు సూచనలు చేశారు.

Updated On 25 March 2024 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story