Vizag Steel Plant Privatization : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుంది.. కేంద్రం స్పష్టీకరణ
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ(Steel Factory) ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం(Central Government) మరోసారి కీలక ప్రకటన చేసింది. డిజిన్విస్టిమెంట్(Disinvestment) ప్రక్రియ ఆగిపోలేదని, అది కొనసాగుతోందని స్పష్టం చేసింది.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ(Steel Factory) ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం(Central Government) మరోసారి కీలక ప్రకటన చేసింది. డిజిన్విస్టిమెంట్(Disinvestment) ప్రక్రియ ఆగిపోలేదని, అది కొనసాగుతోందని స్పష్టం చేసింది. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ(Privatisation) ఆపలేదని తెలిపింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో పురోగతి కూడా ఉందని, ఆర్‌ఐఎన్‌ఎల్ పనితీరును మెరుగుపర్చడానికి మాత్రమే మద్దతు ఇస్తున్నామని, త్వరలో ప్రైవేటీకరణ పూర్తవుతుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. నిన్నటికి నిన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖకు వచ్చి పెట్టుబడుల ఉపసంహరణ తాత్కాలికంగా ఆగినట్టు ప్రకటించారు. ఇది మా ఘనతే అంటూ బీఆర్‌ఎస్, అబ్బే తాము చేయబట్టే ఆగిందని బీజేపీ చెప్పుకున్నాయి. తాములో ఢిల్లీ పెద్దలతో మాట్లాడాము కాబట్టే ప్రైవేటీకరణ ఆగిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకుంది. పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది.