Vizag Honey Trap Case:అందాన్ని ఎరవేసి కోట్లు కొల్లగొట్టడం ఆమె పని! బాధితులు చాలా మందే!
చూడ్డానికి ఆమె అందంగానే ఉంటుంది. బుద్దే వికృతం. ఆ అందంతోనే మగాళ్లను బుట్టలో వేసింది. బ్లాక్‌మెయిల్‌తో కోట్లకు కోట్లు కొల్లగొట్టింది.
చూడ్డానికి ఆమె అందంగానే ఉంటుంది. బుద్దే వికృతం. ఆ అందంతోనే మగాళ్లను బుట్టలో వేసింది. బ్లాక్‌మెయిల్‌తో కోట్లకు కోట్లు కొల్లగొట్టింది. ఆమె పేరు జాయ్ జెమీమా(Joy Jemima)! సమాజంలో పలుకుబడి ఉన్న సంపన్నులను లక్ష్యంగా పెట్టుకుట్టుంది. వారిపై వలపు వల విసురుతుంది. మత్తుమందు ఇస్తుంది. ఆ తర్వాత వారితో చనువుగా ఉన్న ఫోటోలు తీస్తుంది. కొన్ని వీడియోలు కూడా! ఈ ఫోటోలలో కొన్ని అభ్యంతరకమైనవి కూడా ఉంటాయి. ఆ వీడియోలు, ఫోటోలతో బెదిరించడం మొదలు పెడుతుంది. మొత్తం పీల్చి పిప్పి చేస్తుంది. ఆమె వలలో ఇప్పటికే ఎన్ఆర్‌ఐ(NRI)తో పాటు ఇద్దరు పోలీసులను అశ్రయించారు. లేటెస్ట్‌గా హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఓ యువకుడు విశాఖ పోలీసులకు తన కథ చెప్పుకుని బోరుమన్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి విశాఖలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అప్పుడే యజమాని బంధువునని చెప్పుకుని జాయ్ జెమీమా అతడిని పరిచయం చేసుకుంది. కంపెనీలో వర్క్స్ హెడ్‌గా పని చేస్తున్నానని చెప్పుకుంది. అలా కొన్ని రోజులకు ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఓ ఫైన్ డే అతడికి మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చింది. అతడు మత్తులోకి వెళ్లిన తర్వాత సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసింది. వాటిని చపించి బ్లాక్ మెయిల్ మొదలు పెట్టింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫోటోలను భార్యకు, బంధుమిత్రులకు పంపిస్తానని బెదిరించేది. పాపం ఎక్కవ పరువుపోతుందోనన్న భయంతో జెమీమా అడిగినంతా ఇచ్చుకుంటూ వెళ్లాడు. ఆమె టార్చర్ భరించలేక మే 2022లో హైదరాబాద్‌కు వెళ్లిపోదామనుకున్నాడు. అప్పుడు మళ్లీ ఫోటోలు బయటకు తీసి బెదిరించింది.అతడు ప్రాధేయపడ్డా మనసు కరగలేదు. పైగా తాను గర్భవతిని అని చెప్పి మరింత భయపెట్టింది. అయిదు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. అతడు తన ఫ్రెండ్‌ను బతిమాలి అతడి ఖాతా నుంచే 5 లక్షలు ఆమెకు పంపించాడు. అక్కడి నుంచి ప్రతి నెలా బెదిరింది లక్ష రూపాయలు గుంజేది. ఖరీదైన ప్రాంతంలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్న జెమీమా ఫర్నిచర్ కోసం 4 లక్షలు అతడితో ఖర్చు చేయించింది. బాధితుడు హైదరాబాద్‌కు వెళ్లిన ప్రతీసారి వీడియో కాల్స్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది. తన ఆరోగ్యం బాగోలేదని, హైదరాబాద్‌కు వెళ్లిపోతానని బతిమాలితే హైదరాబాద్‌లో మరో ఇల్లు అద్దెకు తీసుకోమని చెప్పింది. అక్కడ కూడా ఫర్నిచర్ కొనిపించింది. మొత్తంగా పది లక్షలు ఖర్చు చేయించింది. అక్కడ్నుంచి మళ్లీ వైజాగ్(Vizag)కు వచ్చింది. అక్కడ మరో ఇల్లు అద్దెకు తీసుకోమని బెదిరించింది. ఆరు లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్‌ను కొనిపించింది. తనను వదిలిపెట్టమని, ఇక తన దగ్గర ఏమీ లేదని బాధితుడు బతిమాలుకుంటే మూడు కోట్లు ఇస్తే వదిలేస్తానని చెప్పిందా వగలాడి. తన ఫ్రెండ్‌ను అడిగి ఇప్పిస్తానని చెప్పినా ఆమెకు నమ్మకం కలగలేదు. మూడు కోట్లు ఇవ్వకుండా పారిపోతాడేమోనన్న అనుమానంతో అతడిని ఓ గదిలో పెట్టి తాళం వేసింది. వారం రోజుల పాటు బంధించింది. తింటి పెట్టకుండా కేవలం పళ్ల రసం మాత్రం ఇచ్చేది. తీవ్రంగా కొట్టింది కూడా! ఆ ఫోటోలను అతడి భార్యకు, బంధు మిత్రులకు పంపించింది. మూడు కోట్లు ఇస్తానని ఆమెను నమ్మించి తన బంగారం(Gold), ఆపిల్ ల్యాప్‌ట్యాప్‌లు, ఐఫోన్లు, మూడు లక్షల రూపాయల నగదు తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఇదితెలుసుకున్న జెమీమా తన మామకు విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి మార్గమధ్యలోనే బాధితుడి కారు ఆపి , బలవంతంగా కారు ఎక్కాడు. బాధితుడి దగ్గర ఉన్న బంగారం, నగదు, విలువైన వస్తువులు తీసుకోడానికి ప్రయత్నించారు. ఆమె కత్తితో పొడవడనికి ప్రయత్నించింద. ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఇదిలా ఉంటే నిందితురాలు ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడిపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు బాధితుడు చెబుతున్నది వాస్తవమేనని తెలుసుకున్నారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాయ్ జెమీమా, ఆమె సహచరులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదివరకు కూడా జెమీమా పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొందరిని మోసం చేసి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసారనే తెలుసుకున్నారు పోలీసులు.