సోమవారం నుంచి సందర్శకులను బ్రిడ్జ్‌ పైకి అనుమతించాలని నిర్వాహకులు భావించారు. అయితే సముద్ర కెరటాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో

విశాఖ పట్నంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ పటిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియపై దుష్ప్రచారం మొదలైంది. బ్రిడ్జ్‌ నుంచి ప్లాట్‌ఫాంను డీ–లింక్‌ చేసి మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తే.. ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయిందని సోషల్‌ మీడియాలోనూ, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారానికి తెరలేపాయి. సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన డీ–లింక్‌ చేస్తున్న దృశ్యాన్ని విడుదల చేశారు.

సోమవారం నుంచి సందర్శకులను బ్రిడ్జ్‌ పైకి అనుమతించాలని నిర్వాహకులు భావించారు. అయితే సముద్ర కెరటాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడు రోజుల పాటు సందర్శకులకు అనుమతి లేదని ముందుగానే ప్రకటించారు. ఈ క్రమంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ టీ జాయింట్‌ పటిష్టతను పరిశీలించేందుకు మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని భావించారు. దీనిపై అధికారులకు సమాచారం అందించారు. బ్రిడ్జ్‌ నుంచి ప్లాట్‌ఫాంను డీ లింక్‌ చేసి అక్కడకు దగ్గరలో ఏర్పాటు చేసిన యాంకర్లకు దగ్గరగా జరిపి ఉంచారు. వాటి మధ్యలో కనిపించిన ఖాళీ ప్రాంతాన్ని ఫొటో తీసి తెగిపోయిందంటూ ప్రచారం చేశారు. ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ పటిష్టతను పరిశీలించేందుకే బ్రిడ్జ్‌ నుంచి ప్లాట్‌ఫాంను డీ లింక్‌ చేశామని జిల్లా కలెక్టర్‌, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. మాక్‌ డ్రిల్‌లో భాగంగా ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ పటిష్టతను పరిశీలించేందుకే నిర్వాహకులు బ్రిడ్జ్‌ నుంచి ప్లాట్‌ఫాంను విడదీసినట్లు చెప్పారు.

Updated On 26 Feb 2024 10:12 PM GMT
Yagnik

Yagnik

Next Story