ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(AP elections 2024) ముంచుకొస్తున్నాయి. మహా అయితే రెండు, రెండున్నరనెలలకు మించి సమయం లేదు. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అప్పుడే ఎన్నికలకు సంసిద్ధమయ్యింది. అభ్యర్థలను ఖరారు చేస్తోంది. సిద్ధం పేరుతో సభలు(Public meetings) నిర్వహిస్తోది. అధికారం కోసం అర్రులు చాస్తున్న టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి మధ్య ఇంకా సీట్ల సర్దుబాటే జరగలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(AP elections 2024) ముంచుకొస్తున్నాయి. మహా అయితే రెండు, రెండున్నరనెలలకు మించి సమయం లేదు. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అప్పుడే ఎన్నికలకు సంసిద్ధమయ్యింది. అభ్యర్థలను ఖరారు చేస్తోంది. సిద్ధం పేరుతో సభలు(Public meetings) నిర్వహిస్తోది. అధికారం కోసం అర్రులు చాస్తున్న టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి మధ్య ఇంకా సీట్ల సర్దుబాటే జరగలేదు. మొన్నటికి మొన్న ఏపీ కాంగ్రెస్‌(AP Congress) పగ్గాలను స్వీకరించిన షర్మిల(YS sharmila) కూడా సభలు, పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఒక్క బీజేపీనే(BJP) ఇప్పట వరకు నిర్లిప్తంగా ఉంది. అసలు ఆ పార్టీ ఎన్నికల వ్యూహమేమిటో అర్థం కావడం లేదు. తమతో పాటు జనసేన ఉన్నదో కూడా బీజేపీకి తెలియదు. తమతో ఉన్న జనసేన పార్టీ టీడీపీతో జతకట్టడానికి ఉవ్విళూరుతోంది. మరి బీజేపీ ఏం చేయబోతున్నదన్నదానిపై ఆ పార్టీ క్యాడర్‌కే స్పష్టత లేదు. జనసేనతోనే ఉంటుందా? టీడీపీతో కూడా జత కడుతుందా అంటే ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎవరితోనూ కలవకండా ఒంటరిగానే ఎన్నికలబరిలో దిగుతుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈ పొత్తుల తంతు తేలేటప్పటికీ పుణ్యకాలం కాస్తా పూర్తవుతుందనుకున్నారే ఏమో కానీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే తనంతట తాను ప్రచారంలోకి దిగిపయారు. పొత్తులు ఉన్నా లేకపోయినా ఈ సీటు తనదేనని చెప్పేశారు. ఓ సుముహూర్తం చూసుకుని గుడికి వెళ్లి దేవుడికి దండంపెట్టి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన ఎవరంటే విష్ణుకుమార్‌ రాజు(Vishnu Kumar Raju). ఈయన కూడా టీడీపీతో బీజేపీ కలిస్తే బాగుంటుందని కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. పొత్తు ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది ఆయన భావన! బీజేపీ అధినాయకత్వమేమో పొత్తుల విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. ఇలాగైతే కష్టమేనని అనుకున్న విష్ణుకుమార్‌ రాజు ప్రచారరంగంలోకి దిగిపోయారు. బీజేపీ అధికారికంగా ప్రకటించినా ప్రకటించకపోయినా విష్ణుకుమార్‌రాజే ఆ పార్టీ తొలి అభ్యర్థి అన్నమాట! 2014లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్‌ రాజు 2019లో మాత్రం ఓడిపోయారు. ఈసారి గెలుపు తనదేనని చెబుతున్నారు.

Updated On 29 Jan 2024 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story