Vishakhapatnam: భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాల్లో 'విశాఖపట్నం' కు చోటు
2047 నాటికి భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ ఒక డాక్యుమెంట్‌ను రూపొందిస్తోంది. ఈ నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి
నీతి అయోగ్ విశాఖపట్నంపై కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కోసం ప్రత్యేకంగా ఆర్దిక ప్రణాళిక రూపొందించింది. భారతదేశాన్ని 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో నీతీ ఆయోగ్ విశాఖపట్నం, ముంబై, సూరత్, వారాణసీ నగరాలకు ఆర్థిక ప్రణాళికను రూపొందించింది. నీతీ ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అధికారికంగా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దోహదపడేలా ఆ నాలుగు నగరాల ఆర్థిక పరివర్తన కోసం నీతీ ఆయోగ్ ఒక ప్రణాళికను రూపొందించింది. నీతి అయోగ్ భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే కీలక నగరాల్లో విశాఖపట్నం కీలకపాత్ర పోషించనుంది. వికసిత్ భారత్-2047 కింద దేశీయ ఆర్థికవ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 2,500 లక్షల కోట్లుకి చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తూ ఉంది.
వికసిత్ భారత్ 2047 కోసం గతేడాది 10 రంగాలను ఏకీకృతం చేసే పనిని నీతి-ఆయోగ్‌కు అప్పగించారు. ఇందులో ఆర్థికవృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ పరిరక్షణ సహా అభివృద్ధి వివిధ అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు యువత నుంచి 10 లక్షలకుపైగా వివరణాత్మక సూచనలు వచ్చాయి. 2047 నాటికి భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ ఒక డాక్యుమెంట్‌ను రూపొందిస్తోంది. ఈ నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా ముద్ర పడ్డ విశాఖ నగరానికి మరిన్ని వసతులు, వనరులు కల్పించేందుకు, అంతర్జాతీయంగా విశాఖ బ్రాండింగ్‌ను పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి.