MVV Satyanarayana family kidnap : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
విశాఖలో పట్టపగలు ఓ అధికార పార్టీ ప్రతినిధి ఇంట కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణితో పాటు కుమారుడు, ఆడిటర్‌లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడం సంచలనం సృష్టించింది. రుషికొండలోని ఎంపీ నివాసం నుంచి ముగ్గురిని అపహరించినట్లు తెలుస్తోంది.

MVV Satyanarayana
విశాఖలో పట్టపగలు ఓ అధికార పార్టీ ప్రతినిధి ఇంట కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) సతీమణితో పాటు కుమారుడు, ఆడిటర్‌లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడం సంచలనం సృష్టించింది. రుషికొండలోని ఎంపీ నివాసం నుంచి ముగ్గురిని అపహరించినట్లు తెలుస్తోంది. రుషికొండలోని ఎంపీ నివాసంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. మొదట ఎంపీ కుమారుడిని, ఆ తర్వాత ఎంపీ సతీమణి జ్యోతిని బంధించారు. ఆపై ఎంపీ సతీమణి జ్యోతి ద్వారా మాట్లాడేందుకు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరావుని ఇంటికి పిలిపించి.. ముగ్గురిని వాహనంలో తమతో తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపీ ఎంవీవీ ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఉండటంతో.. ఘటన జరిగిన సమయంలో ఎంపీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది లేదని తెలుస్తోంది. కిడ్నాపర్ల చెర నుంచి ముగ్గురిని రక్షించిన పోలీసులు.. ఘటనపై స్పందించాల్సివుంది. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు.
