Deputy CM Pawan Kalyan:విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వానిదా పవన్?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మేథా సంపత్తి చాలా ఎక్కువ. లక్ష పుస్తకాలు చదివినవారికి ఆ మాత్రం మేథస్సు ఉంటుంది. అది మరోసారి రుజువయ్యింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మేథా సంపత్తి చాలా ఎక్కువ. లక్ష పుస్తకాలు చదివినవారికి ఆ మాత్రం మేథస్సు ఉంటుంది. అది మరోసారి రుజువయ్యింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని(Visakha Steel Plant)ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయవద్దంటూ, ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ఎన్‌డీఏ(NDA)లో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ దగ్గరకు కొందరు కార్మిక నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులను పవన్ కల్యాణ్ కొన్ని చిత్రమైన ప్రశ్నలు వేసి వారు తెల్లమొహాలు వేసుకునేలా చేశారు. గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భూములను అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా? అన్నది మొదటి ప్రశ్న.. దానికి వారు ఏమని జవాబు చెప్పారో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ(TDP) అనుకూల పత్రిక మాత్రం అవును నిజమేనని వారంతా చెప్పినట్టు రాసుకొచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందా? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందా? కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ భూములను అమ్ముతుంటే, దానిని ప్రైవేటీకరిస్తుంటే ఆ ప్రభుత్వాన్ని కదా అడగాలి? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ముఖ్యమంత్రి హోదా ఉన్నా సరే, జగన్ ఆ భూములను అమ్ముకోగలడా?
ఉక్కు పరిశ్రమ భూములను విక్రయించాలని జగన్మోహన్‌రెడ్డి విధంగా ప్రతిపాదిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదని అయిదో తరగతి విద్యార్థిని అడిగినా చెబుతాడు. మరి పవన్ ఆ ప్రశ్న అడగడమేమిటి? ఆ పత్రిక ఆ రాతలు రాయడమేమిటి? విశాఖ ఉక్కుతో కేంద్రానికి సంబంధం లేకపోతే, మరి గతంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడానని పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పినట్టు? రాష్ట్రంలో ఏది జరిగినా దానిని జగన్మోహన్‌రెడ్డితో ముడిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandra Babu), డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Deputy CM Pawan Kalyan) కంకణం కట్టుకున్నట్టుగా ఉంది.