డబ్బు కోసం నిండుప్రాణాన్ని బలి తీసుకున్నాడో దుర్మార్గుడు. ప్లాన్‌ వేసి మరీ చంపాడు. ఆమెను చంపింది ఎవరో కాదు, ప్రియుడే! అసలేం జరిగిందంటే.. ఈ నెల 8వ తేదీన ఈశ్వరి అనే వివాహిత విశాఖ ద్వారాక నగర్‌లో(Vishaka Dwaraka Nagar) అనుమానాస్పదంగా మరణించారు. ఆమె మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి ఇంట్లో అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని నమ్మించారు.

డబ్బు కోసం నిండుప్రాణాన్ని బలి తీసుకున్నాడో దుర్మార్గుడు. ప్లాన్‌ వేసి మరీ చంపాడు. ఆమెను చంపింది ఎవరో కాదు, ప్రియుడే! అసలేం జరిగిందంటే.. ఈ నెల 8వ తేదీన ఈశ్వరి అనే వివాహిత విశాఖ ద్వారాక నగర్‌లో(Vishaka Dwaraka Nagar) అనుమానాస్పదంగా మరణించారు. ఆమె మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి ఇంట్లో అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని నమ్మించారు. నిజమేనని అనుకున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. ఎందుకైనా మంచిదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అది మర్డర్‌ అని తేలింది. బతుకు తెరువు కోసం కుటుంబంతో విశాఖకు వచ్చిన ఈశ్వరిని నమ్మినవాడే ప్రాణాలు బలి తీసుకున్నాడని రుజువయ్యింది. ఈశ్వరికి ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలో పని చేస్తున్న షాహిద్‌ అలీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఈశ్వరి పేరుతో ఇన్సూరెన్స్‌(Insurance) చేయించాడు షాహిద్ అలీ.

ఇన్సూరెన్స్ అమౌంట్‌ను తానే చెల్లిస్తానని.. మెచ్యూరిటీ పూర్తవ్వగానే వచ్చిన డబ్బులలో చెరి సగం తీసుకుందామని ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాలసీ మెచ్యూరిటీ డేట్ దగ్గరపడుతుండటంతో ఇద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. 15 లక్షల రూపాయల సొమ్ము కావడంతో పంపకాల విషయంలో గొడవలు జరిగాయి. దీంతో ఈశ్వరిపై కక్ష పెంచుకున్నాడు షాహిద్‌ అలీ. ఆమెను చంపేసి ఆ పాలసీ సొమ్ము మొత్తం కాజేయాలని ప్లాన్‌ వేశాడు. ప్లాన్‌లో భాగంగా ఆమెను ఇన్సూరెన్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఏయూ పరిసర ప్రాంతాలలో తిప్పాడు. అక్కడ ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ప్రమాదంలో మరణిస్తే ఎక్కువ బీమా వస్తుందని అతడికి తెలుసు కాబ్టటి ఆ మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. అది అందరూ నమ్మేలా ప్రయత్నించాడు. వాహనంపై వెళుతున్నప్పుడు కింద పడిందని చెప్పి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డెత్‌ సర్టిఫికెట్‌, ఇతర పత్రాలు తీసుకుని గాజువాక ఆంటోని నగర్‌లో ఉన్న జితేంద్ర సహకారంతో ఆటోలో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగించాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని చెప్పాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో మరణం వెనుక ఉన్న ప్లాన్‌ వెలుగులోకి వచ్చింది. ఆధారాలను సేకరించిన పోలీసులు.. షాహిద్ అలీ, అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి జైల్లో తోశారు.

Updated On 16 April 2024 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story