Tirumala VIP Darshan: ఇక వీఐపీ దర్శనాలు చేసుకోవచ్చు
ఎన్నికల కోడ్ కారణంగా తిరుమలలో నెల రోజుల నుంచి ఆగిపోయిన
ఎన్నికల కోడ్ కారణంగా తిరుమలలో నెల రోజుల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను ఇకపై అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీల సిఫారుసుపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలని టీటీడీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో ఈసీ సానుకూలంగా స్పందించింది. గత తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది ఎస్ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను జారీ చేస్తున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 22 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ ఉత్సవాల కారణంగా మే 21 నుండి 24వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 23న తిరుప్పావడ సేవ, మే 24న లక్ష్మి పూజ ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.