చిత్తూరు(Chotoore) జిల్లా కాణిపాకం(Kanipakam) శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహోత్సవాలు(Annual celebrations) నేత్రపర్వంగా సాగుతున్నాయి. శుక్రవారం స్వామివారికి శేష వాహన సేవను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి, అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిత్తూరు(Chittoor) జిల్లా కాణిపాకం(Kanipakam) శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహోత్సవాలు(Annual celebrations) నేత్రపర్వంగా సాగుతున్నాయి. శుక్రవారం స్వామివారికి శేష వాహన సేవను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి, అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలంకరించిన బంగారు శేష వాహనంపై(Golden chariot) ఉంచి గ్రామ పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి(Chairman Mohan Reddy), కాణిపాకం ఈవో వెంకటేశు, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, మాజీ చైర్మన్ మణి నాయుడు, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్ నాయుడు, ఐరాల మాజీ జెడ్పీటీసీ లతా, స్థానిక మాజీ సర్పంచ్ మధుసూదన్, శేష వాహన ఉభయ దారులు తదితరులు వివిధ ప్రాంతాలలో నుంచి వచ్చిన భక్తులు మరియు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Updated On 23 Sep 2023 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story