విక్రమాదిత్య కంగనాపై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్‌ రాష్ట్రంలోనూ

హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ 'మండి' లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన తల్లి, రాష్ట్ర పార్టీ చీఫ్ ప్రతిభా సింగ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన నటి కంగనా రనౌత్‌పై విక్రమాదిత్య సింగ్‌ పోటీ చేయనున్నారు. మండి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రతిభా సింగ్ మూడుసార్లు గెలిచారు. విక్రమాదిత్యపై కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలను తాను పట్టించుకోనని, క్లిష్ట పరిస్థితుల్లోనూ తాను గెలిచానని ఆమె అన్నారు. మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతోనే ఉన్నారని.. హిమాచల్‌ ప్రజల గురించి కంగనాకు ఏం తెలియదని, ఈ ఎన్నికల్లో ఆమె గెలవదని అన్నారు.

విక్రమాదిత్య కంగనాపై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్‌ రాష్ట్రంలోనూ, మండిలోని సమస్యల గురించి మాట్లాడాలన్నారు. ఎన్నడూ లేనంత దారుణమైన వర్షాకాలంలో మనాలిని ఒక్కరోజు అయినా కంగనా సందర్శించారా అని ప్రశ్నించారు. విపత్తు సమయాల్లో తాను గ్రౌండ్ జీరోలో ఉన్నానని విక్రమాదిత్య సింగ్ చెప్పారు. హిమాచల్ ప్రజలకు.. ముంబైలో మీరు తినే దానితోనూ, త్రాగే దానితోనూ ఎలాంటి సంబంధం లేదు.. దయచేసి సమస్యలపై మాట్లాడండని కోరారు. జూన్​ 1న హిమాచల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి జూన్​ 4న ఫలితాలు వెలువడనున్నాయి. తప్పకుండా గెలుస్తానని కంగనా రనౌత్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Updated On 13 April 2024 7:38 AM GMT
Yagnik

Yagnik

Next Story