Another shock for TDP : టీడీపీకి అక్కడ వరుస షాక్ లు..!
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విజయవాడలో టీడీపీ ఖాళీ అవ్వబోతోందని కేశినేని నాని ఇప్పటికే తేల్చి చెప్పారు.

Vijayawada Tdp Leader Gogula Venkataramana Quits TDP And Joins YSRCP
విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani), ఆయన కుమార్తె కేశినేని శ్వేత(Kesineni Swetha) టీడీపీ(TDP)కి గుడ్ బై చెప్పి వైసీపీ(YCP)లో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విజయవాడ(Vijayawada)లో టీడీపీ ఖాళీ అవ్వబోతోందని కేశినేని నాని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తిరువూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్(Nallagatla Swamydas) కూడా కేశినేని నాని బాటలోనే వైసీపీ కండువా కప్పుకున్నారు.
తాజాగా విజయవాడకు చెందిన మరో సీనియర్ నేత టీడీపీని వీడి.. సీఎం జగన్(CM Jagan) సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ(Gogula Venkata Ramana) వైఎస్సార్‌సీపీలోకి చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు.
కేశినేని నాని సమయం దొరికినప్పుడల్లా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), నారా లోకేశ్(Nara Lokesh) లపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ధనికుల పక్షపాతి అయిన చంద్రబాబు పనికిమాలిన వ్యక్తి అని అన్నారు. ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ని మంత్రిని చేశారని.. లోకేశ్ కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. మీడియాను మేనేజ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తం చంద్రబాబు అని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదని.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి చూపించిన గొప్ప నాయకుడు జగన్ అని కొనియాడారు. జగన్ పేదల పక్షపాతి అని చెప్పారు.
