Beaking News : తుని రైలు దహనం కేసును కొట్టేసిన రైల్వే కోర్టు
తుని రైలు దహనం కేసు(Thuni Railway Case)ను సోమవారం రైల్వే కోర్టు కొట్టేసింది. 2016 జనవరి 30న కాపు నాడు సభ సందర్భంగా తుని రైలు దహనం ఘటన జరిగింది. ఈ కేసులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు మొత్తం 41 మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసు విచారణ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజా,
తుని రైలు దహనం కేసు(Thuni Railway Case)ను సోమవారం రైల్వే కోర్టు కొట్టేసింది. 2016 జనవరి 30న కాపు నాడు సభ సందర్భంగా తుని రైలు దహనం ఘటన జరిగింది. ఈ కేసులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు మొత్తం 41 మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసు విచారణ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవీతో పాటు 41మంది కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో 25 మందిని పోలీసులు సాక్షులుగా పేర్కొన్నారు. న్యాయస్థానం 20 మందిని విచారించింది. ఐదుగురు మాత్రం.. నేరం గురించి తమకు తెలియదని సాక్ష్యం చెప్పారు. కేసు కొట్టేసిన కోర్టు.. ముగ్గురు ఆర్ఫీఎఫ్ పోలీసులు విచారణ సరిగా చేయలేదని పేర్కొంది. ఇదిలావుంటే.. ప్రభుత్వం కూడా ఇప్పటికే తుని ఘటనలో కేసులను వెనక్కు తీసుకుంది. ఈ క్రమంలోనే రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.
కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కాపులను బీసీల్లో చేర్చాలన్న నినాదంతో 2016 జనవరి 31న తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు వేలాది మంది కాపులు హా.రయ్యారు. సభ అనంతరం అక్కడ అల్లర్లు చెలరేగాయి. విధ్వంస కాండ నెలకొంది. తుని రైల్వే స్టేషన్‌లో ఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు గుర్తు తెలియని కొందరు నిప్పంటించారు. మంటలలో పలు బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు కూడా దహనం అయ్యాయి.