Kesineni Nani : చంద్రబాబు క్షేమంగా బయటకురావాలని కోరుకున్నా
విజయవాడ ఎంపీ కేశినేని నాని దుర్గమ్మను దర్శించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా కేశినేని నాని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.

Vijayawada MP Keshineni Nani visited Durgamma
విజయవాడ(Vijayawada) ఎంపీ కేశినేని నాని(MP Kesineni Nani) దుర్గమ్మను దర్శించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా కేశినేని నాని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. దర్శన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలావుంటే.. దేవి శరన్నవరాత్రులు మహోత్సవములో భాగంగా ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలా నక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మ వారి ఆశీస్సులతో దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. దేశం,రాష్ట్రం బావుండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి 45 సంవత్సరాలుగా కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో క్షేమంగా బయటకురావాలని కోరుకున్నానని వెల్లడించారు. అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.
