Vijayawada High Way : నగరబాట పట్టిన జనం.. కిక్కిరిసిన మెట్రో రైళ్లు
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు(Election) ముగిశాయి. ఓటేయడానికి సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి హైదరాబాద్(Hyderabad) బాటపట్టారు. విజయవాడ జాతీయ రహదారి(Vijayawada High Way) వాహనాలతో కిక్కిరిసిపోయింది.

Vijayawada High Way
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు(Election) ముగిశాయి. ఓటేయడానికి సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి హైదరాబాద్(Hyderabad) బాటపట్టారు. విజయవాడ జాతీయ రహదారి(Vijayawada High Way) వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు సరేసరి!మంగళవారం తెల్లవారుజామున కొందరు నగరానికి వచ్చేశారు. దీంతో ఉదయం అయిదున్నర గంటల నుంచే సిటీ బస్సులు(City Buses), మెట్రో రైళ్లు(Metro) ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మెట్రో స్టేషన్లలో రద్దీ కనిపించింది. రైలు రావడమే ఆలస్యం బోగీలన్ని నిండిపోయాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అరగంట ముందే మెట్రో సర్వీసులను ప్రారంభించారు.
