ఆంధ్రప్రదేశ్(Andrapradesh) లో పలుచోట్ల గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి .ముఖ్యంగా యువతను ,స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసి దందాలను కొనసాగిస్తున్నారు ఈ గంజాయి ముఠాలు . మత్తుకి బానిసలుగా మారుస్తున్నారు . పోలీసులు ,గవర్నమెంట్ లు ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికి ప్రయోజనం లేకుండా పోతుంది . చాల మంది మత్తుకు బానిసలై భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు . ఇటీవల కాలంలో విజయవాడ లో గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి . ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి అమ్మకాలను చేస్తున్న ముఠాకి సంబంధించి 19 మందిని నగర బహిష్కరణ విధించింది .వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం .

ఆంధ్రప్రదేశ్(Andrapradesh) లో పలుచోట్ల గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి .ముఖ్యంగా యువతను ,స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసి దందాలను కొనసాగిస్తున్నారు ఈ గంజాయి ముఠాలు . మత్తుకి బానిసలుగా మారుస్తున్నారు . పోలీసులు ,గవర్నమెంట్ లు ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికి ప్రయోజనం లేకుండా పోతుంది . చాల మంది మత్తుకు బానిసలై భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు . ఇటీవల కాలంలో విజయవాడలో గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి . ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి అమ్మకాలను చేస్తున్న ముఠాకి సంబంధించి 19 మందిని నగర బహిష్కరణ విధించింది .వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం .

విజయవాడలో (vijayawada)గత కొద్దీ నెలలుగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపారు పోలీసుశాఖ . తాజాగా కొంతమందికి నగర బహిష్కరణ విధించింది . సాధారణంగా ఇలాంటి వాటిలో మగవాళ్లే ఎక్కువుగా దందాలకు పాల్పడుతువుంటారు .కానీ విజయవాడకు చెందిన ఒక కేడి లేడీ పోలిసుల కళ్లుకప్పి ఈ దందాకు నాయకత్వం వహిస్తుంది . ఆమె పేరు సారమ్మ అలియాస్‌ శారద(saramma Alias Sharadha).ఇప్పటికే సారమ్మ పైన 13 కేసులు ఉన్నాయి. గంజాయి అమ్మకంతో పాటు పలు వివాదాల్లో కూడా ఆమెపై కేసులు నమోదయ్యాయి . ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు పెట్టినా తీరు మారకపోవడంతో చివరికి నగర బహిష్కరణే మార్గమని భావించారు పోలీసులు .

మళ్ళీ గంజాయి కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠినమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు సీపీ క్రాంతి రాణా టాటా(CP kranthi raana Tata) . కొంత మంది రౌడీషీటర్లు ,నేరాలకు పాల్పడే వారికీ నగర బహిష్కరణ శిక్ష సహజమే అయినప్పటికీ నగరంలో ఒక మహిళ పై ఇలాంటి చర్య తీసుకోవటం ఇదే మొదటిసారి కావటం విశేషం అలాగే చర్చనీయాశం అయ్యింది .

Updated On 25 April 2023 5:04 AM GMT
rj sanju

rj sanju

Next Story