టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి, ఇప్పటికీ పెద్ద వ్యత్యాసం ఏముందని

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇది ఇంకొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తని విమర్శలు గుప్పించారు. ఈ 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందని జోస్యం చెప్పారు. సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్సార్‌సీపీకే ఓటు వేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపును ఇచ్చారు.

టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి, ఇప్పటికీ పెద్ద వ్యత్యాసం ఏముందని ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో మోసాలు, అబద్ధాలు, అమలుపరచని వాగ్దానాలను ఏపీ ప్రజలు చూశారని అన్నారు విజయసాయి రెడ్డి. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత రాత్రి ఢిల్లీలో అమిత్ షా నివాసానికి వెళ్లారు. అమిత్ షాతో జరిగిన భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Updated On 8 March 2024 1:37 AM GMT
Yagnik

Yagnik

Next Story