Vijayasai Reddy viral Tweet:ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి.. విజయసాయి సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరన్నారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు(Deputy CM Pawan Kalyan ) ఉందని విజయసాయిరెడ్డి ఎక్స్ (Twitter)వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు. ఇదే విధంగా నిన్న కూడా చంద్రబాబుపై మరో సెటైరికల్ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన వెన్నుపోటుదారుల్లో చంద్రబాబు ఒకరని ఎద్దేవా చేశారు. మార్కస్ బ్రూటస్ (Julius Caesar), మిర్ జాఫర్ (bengal), జూడాస్ (Jesus), రాజా జయ్‌చంద్ (Raja Prithviraj)ను వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు ఎన్టీఆర్‌ను పొడిచారని ఆయన పేర్కొన్నారు.