బాపట్ల జిల్లా మేద‌రమెట్ల జాతీయ రహదారి వద్ద మార్చి 3న నిర్వహించ తలపెట్టిన సిద్ధం సభ‌ను 10వ తేదీన జరిపాలని పార్టీ నిర్ణయించిందని ఎంపీ, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. బాపట్లలో ఆయ‌న మాట్లాడుతూ..

బాపట్ల జిల్లా మేద‌రమెట్ల జాతీయ రహదారి వద్ద మార్చి 3న నిర్వహించ తలపెట్టిన సిద్ధం సభ‌ను 10వ తేదీన జరిపాలని పార్టీ నిర్ణయించిందని ఎంపీ, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. బాపట్లలో ఆయ‌న మాట్లాడుతూ.. సిద్ధం సభలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. మేద‌రమెట్ల సిద్ధం సభకు వచ్చేందుకు ఇప్పటివరకూ 7 లక్షలపైగా ఇప్పటి వరకూ సంసిద్ధత తెలిపారని వెల్ల‌డించారు. మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నాం. 98 ఎకరాలలో స‌భా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. పార్కింగ్ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుండి పెద్ద ఎత్తన ప్రజలు స‌భ‌కు హాజరవుతారన్నారు. ప్రభుత్వ పథ‌కాలు, పాలనపై పార్టీ కేడ‌ర్, ప్రజలకు అధినేత జగ‌న్ సభలో దిశా నిర్ధేశం చేస్తారని తెలిపారు.

మార్చి 13, 14 తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉంద‌న్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండవచ్చని పేర్కొన్నారు. సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అన్ని ఏర్పాట్లు చేస్తామ‌న్నారు.పేద వర్గాలతో పాటు అగ్రకులాలలో కూడా వైస్సార్సీపీపై అపూర్వ స్పందన ఉందన్నారు. ప్రభుత్వం పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నామ‌ని తెలిపారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన చేసిందన్నారు. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం మాకు ఉందన్నారు. మేద‌ర‌మెట్ల‌ సిద్ధం సభలో మూడు గంటలకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ప్రసంగిస్తారు. 5 గంటలకు సభ ముగుస్తుందన్నారు. మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. మేనిఫెస్టో అతి త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. పొత్తులు ఎవరు పెట్టుకున్నా.. ప్రజలు మా వైపే వున్నారని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

Updated On 28 Feb 2024 5:49 AM GMT
Yagnik

Yagnik

Next Story