ViajayaSaiReddy: టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమిపై విజయసాయిరెడ్డి రియాక్షన్ ఇదే!!
టీడీపీ- బీజేపీ – జనసేన పార్టీల కూటమిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు

టీడీపీ- బీజేపీ – జనసేన పార్టీల కూటమిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు
టీడీపీ- బీజేపీ – జనసేన పార్టీల కూటమిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని.. దేశంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడన్నారు. గతంలో ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశాడో చెప్పాలని.. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు చేసేది ఏమీ ఉండదన్నారు. చంద్రబాబు పొత్తుల్లో నిజాయితీ, నిబద్ధత ఉండదన్నారు విజయసాయి రెడ్డి. ఈ పొత్తులు సిద్దాంతాల ఆధారంగా కాదని.. కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని మాత్రమే పొత్తు పెట్టుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.
సిద్ధం సభకు 15లక్షల మందికి తక్కువ కాకుండా ప్రజలు వస్తున్నారని.. ఆరు జిల్లాల్లో గ్రామాల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన వచ్చిందని విజయసాయిరెడ్డి అన్నారు.
