వైసీపీకి రాజీనామా చేసి 2 నెలలు కూడా గడవకముందే మరో పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసుకున్నారా ?

విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా ? వైసీపీకి రాజీనామా చేసి 2 నెలలు కూడా గడవకముందే మరో పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసుకున్నారా ?

ఓ జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారా ? ఇందుకు డేట్,టైం కూడా ఫిక్సయిందా

వైసీపీలో జగన్ తర్వాత జగన్‌లా ఒక వెలుగువెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయం సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన కొత్త పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఆయన బీజేపీలోకి వెళ్లపోతున్నారనే ప్రచారం కూడా మొదలైంది

విజయసాయిరెడ్డికి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. 2016లో రాజ్యసభకు తొలిసారి ఎంపికైనప్పటి నుంచి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రధాని మోడీ సైతం ఆయన పేరు గుర్తు పెట్టుకుని పలుకవరించేవారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే ఆయనకు అపాయింట్మెంట్లు అడిగిన వెంటనే ఇచ్చేవారు

తాజాగా ఆయన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ స్వాగతం పలుకుతూ కనిపించారు.దాంతో ఆయన రాజకీయాలను వీడాలనుకున్నా అది అంత ఈజీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఆ క్రమంలోనే మరో వార్త జోరుగా ప్రచారంలోకి వచ్చింది.

ఈ క్రమంలో లేటెస్ట్‌గా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే బీజేపీలోకి విజయసాయిరెడ్డి వెళ్తారని అంటున్నారు. దానికి ఒక డేట్ టైం, ముహూర్తం కూడా నిర్ణయించారని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకుంటారట. ఇప్పటికీ బీజేపీ పెద్దలతో విజయసాయి రిలేషన్స్‌ని కొనసాగిస్తున్నారని అంటున్నారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్న దానిపై టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందన్న ప్రచారం ఉంది. నిజంగానే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే జగన్‌కి ఇబ్బందులు తప్పవనే చర్చ నడుస్తోంది. జగన్ A1గా ఉన్న ఆస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి A2గా ఉన్నారు. సాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుని అప్రూవర్‌గా మారితే ఏపీ పాలిటిక్స్‌లో పెనుమార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ehatv

ehatv

Next Story