ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్లకు సంబంధించి అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రతినిధులు ఈసీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధార్ కార్డుకు ఓటర్ కార్డు లింక్ చేస్తున్నారనేదే చంద్రబాబు బాధ అని ఆరోపించారు. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ

ఆధార్ కార్డుకు ఓటర్ లింక్ చేస్తున్నారనేదే టీడీపీ అధినేత బాధ
ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ ఉంటే చంద్రబాబే విజయం సాధిస్తారు
చంద్రబాబు హయాంలో మోసపూరిత ఓట్లను ఎలా ఎన్ రోల్ చేశారో ఈసీకి చెప్పామన్న ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్లకు సంబంధించి అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రతినిధులు ఈసీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధార్ కార్డుకు ఓటర్ కార్డు లింక్ చేస్తున్నారనేదే చంద్రబాబు బాధ అని ఆరోపించారు. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ పెడితే చంద్రబాబు కచ్చితంగా విజయం సాధిస్తారని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఓటు ఉండాలి... పారదర్శకంగా ఉండాలనేదే వైసీపీ విధానమని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నట్లు తమ ఓట్లను ఎలా తొలగించారో, అలాగే మోసపూరిత ఓట్లను ఎలా ఎన్‌రోల్ చేశారో కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పామన్నారు. 2015 నుండి చంద్రబాబు దొంగ ఓట్లను చేర్చారన్నారు. ఈసీ రూల్స్‌ను తుంగలో తొక్కారని నిప్పులు చెరిగారు. ఇంటి నెంబర్లు, పేర్లను టీడీపీ హయాంలో ఎలా మేనేజ్ చేశారో చెప్పామన్నారు. సేవా మిత్ర, మై టీడీపీ యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఈసీకి ఇచ్చామన్నారు. ఓటర్ ప్రొఫైలింగ్‌కు పాల్పడ్డారని, ఇది నేరపూరిత చర్య అన్నారు. టీడీపీ అభ్యంతరకర సమాచారాన్ని సేకరిస్తోందన్నారు. ఓటరు నుండి పొలిటికల్ ప్రిఫరెన్స్, పార్టీ ఛాయిస్ అడుగుతున్నారని, ఇది ఎందుకో చెప్పాలన్నారు. ఎవరైనా ఓటర్ క్యాస్ట్ గురించి అడుగుతారా? అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటిని ఈసీ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

Updated On 28 Aug 2023 8:05 AM GMT
Ehatv

Ehatv

Next Story