VijayasaiReddy Vs ABN Radhakrishna:రాధాకృష్ణ సవాల్‌కు విజయసాయిరెడ్డి ప్రతి సవాల్!
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విసిరిన సవాల్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విసిరిన సవాల్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. మొన్నటి తన కొత్త పలుకులో విజయసాయిరెడ్డిపై రాధాకృష్ణ ఘటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతకు మించిన ఆరోపణలు చేశారు. 'నీది మనిషి పుట్టుకే అయితే, నా మీద ప్రేలాపనలు మానేసి బహిరంగ చర్చకు రావాలి. నువ్వొక రాజకీయ వ్యభిచారివి. జగన్ నన్ను నమ్మడం లేదంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీలను బీజేపీలో చేర్పిస్తానని తిరిగావు. కేంద్రమంత్రి కూడా నిన్ను మోసగాడివని తిట్టారు. అంతేనా నువ్వే స్వయంగా జగన్ తరపున రాయబేరం పట్టుకుని నా దగ్గరకు వచ్చావు. ఏం ప్రతిపాదన తెచ్చావో చెప్పాలా? జగన్ చివరకు ఏ స్థాయికి దిగజారాడో, నా దగ్గరకు ఎలాంటి బేరాలు తీసుకొచ్చాడో బయటపెట్టాలా? ఇక్కడ కాదు, ఢిల్లీలో ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం పెడతాం. మీ దిక్కుమాలిన ఛానెల్‌కు కూడా రప్పించుకున్నా సరే .. అన్నీ కూలంకషంగా మాట్లాడుకుందాం. సవాల్ విసురుతున్నా.. స్వీకరించే దమ్ముందా?' ఇలా దమ్మున్న ఛానల్ అని చెప్పుకునే రాధాకృష్ణ సవాల్ విసిరారు. రెండు రోజుల తర్వాత విజయసాయిరెడ్డి రియాక్టయ్యారు. ఆర్కేకు ప్రతి సవాల్ విసిరారు. 'రాధాక్రిష్ణ.. బహిరంగ చర్చకు నేను రెఢీ. నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. ఫేస్ టు ఫేస్.. కౌంటర్ కు ఎన్ కౌంటర్ నేను సిద్ధం. నువ్వు సిద్దమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా? ఢిల్లీలో ఎన్జీవోలు.. మేధావులు.. జర్నలిస్టులు.. అన్ని టీవీ చానల్స్ ను అందరిని ఆహ్వానిద్దాం' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా రాధాకృష్ణపై ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. 'జర్నలిస్టు కాలనీలో నువ్వు ఉండే ప్యాలస్.. నేను ఉండే బాడుగ ఇళ్లు కూడా చూపిద్దాం. ఫిలింనగర్ మొయిన్ రోడ్డులో నువ్వు కొన్ని రూ.100 కోట్లు విలువ చేసే స్థలం.. దాన్లో ఇంకో రూ.200 కోట్లతో కడుతున్న ఆఫీస్ భవంతిని పరిశీలిద్దాం. రాధాక్రిష్ణ.. నీ పత్రిక.. టీవీని ఏ పునాదులపై నిర్మించుకున్నావో మరువద్దు. నష్టాలు వస్తున్నాయని ఇప్పటికీ అమెరికాకు వెళ్లి ఎన్నారైల దగ్గర చందాలు తెచ్చుకోవటం వాస్తవం కాదా? కలర్ బ్లైండ్ నెస్ లా నీ కళ్లకు కొందరే కనిపిస్తారు. మిగితావాళ్లంతా నీవేం అన్నా పడాలి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' నేను ఐక్యరాజ్యసమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ! ఎవరి చిత్తశుద్ధి ఏమిటో తేల్చుకుందాం. తగ్గేదేలే.. భయపడేదేలే! గత అయిదేళ్లలో మద్యం, ఖినిజ సిండికేట్ బ్రోకర్లు, మిగా ఇతరత్రా డీల్స్‌లో మీ బాస్ పేరు చెప్పి వసూళ్లు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం' అని ప్రతిసవాల్ విసిరారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయి సవాల్‌కు ఆర్కే స్పందించి ఇద్దరూ చర్చ పెట్టుకుంటే చూడాలని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. ఎవరేమిటో అందులో తెలిసిపోతుంది కదా!