Vijayasai Reddy Tweet : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పూర్తిగా మారిపోయారు!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy)లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన పూర్తిగా మారిపోయారిప్పుడు. ఒకప్పుడు ఆయన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉండేవి. అసభ్యకరమైన భాషను వాడేవారాయన! ఎందుకోకానీ కొన్నాళ్లుగా ఆయన వ్యవహారశైలి, ఆయన ఉపయోగించే భాషలలో మార్పు కనిపిస్తోంది. మార్పు మంచిదే కదా! ఇవాళ తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బర్త్ డే(Chandrababu Naidu Birth Day) కదా!

Vijayasai Reddy Tweet
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy)లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన పూర్తిగా మారిపోయారిప్పుడు. ఒకప్పుడు ఆయన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉండేవి. అసభ్యకరమైన భాషను వాడేవారాయన! ఎందుకోకానీ కొన్నాళ్లుగా ఆయన వ్యవహారశైలి, ఆయన ఉపయోగించే భాషలలో మార్పు కనిపిస్తోంది. మార్పు మంచిదే కదా! ఇవాళ తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బర్త్ డే(Chandrababu Naidu Birth Day) కదా! ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.. బాగుంది కానీ ఇదే విజయసాయిరెడ్డి ఇదే చంద్రబాబు పుట్టిన రోజున గతంలో ఎలాంటి ట్వీట్ చేశారన్నది గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ మరోసారి ఆ ట్వీట్ సారాంశాన్ని చూద్దాం..'ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్‌డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం. 17 తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదన్న సందేశాన్ని ఇప్పటికీ మీ వాళ్లు పాటిస్తున్నారులే బాబు.. మళ్లీ నీ బ్రీఫ్‌డు అవసరం లేదు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి.. ఈ రెండూ ట్వీట్లలలో ఎంత మార్పు? నిజమే, విజయసాయిరెడ్డి పూర్తిగా మారిపోయారు.. శుభం!
