Chandrababu Birthday : చంద్రబాబుకు విజయసాయి రెడ్డి బర్త్డే విషెస్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా విజయసాయి రెడ్డి చంద్రబాబుకు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు.

Vijayasai reddy Birthday Wishes to TDP Leader Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంTelugudesham) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)కు వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(Viajaysai Reddy) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్(Twitter) వేదికగా విజయసాయి రెడ్డి చంద్రబాబుకు పుట్టినరోజు విషెస్(Birthday Wishes) తెలియజేశారు. విజయసాయి రెడ్డి.. "టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2023
సీఎం జగన్(CM Jagan)కు దగ్గరి మనిషైన విజయసాయి రెడ్డి గతంలో చంద్రబాబుపై, టీడీపీ(TDP)పై, ఆ పార్టీ నాయకులపై తీవ్రవిమర్శలు చేసేవారు. ట్విటర్ వేదిక వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. అయితే ఈ మధ్య ఆయన సైలెంట్ అయ్యారు. తారకరత్న(Tharakaratna) మరణం సమయంలో చంద్రబాబును, తారకరత్న కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి కలిశారు. తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి(Alekhya Reddy).. విజయసాయి రెడ్డికి దగ్గరి బంధువు. అప్పటినుండి విజయసాయిరెడ్డి విమర్శల జోలికి వెళ్లకపోవడం విశేషం.
