Vijay Sai Reddy Vs YS Jagan : చెప్పుడు మాటలు విని జగన్ చెడిపోయిండు..!
వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీల కేసులో విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయని..ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని విజయసాయిరెడ్డి అన్నారు. కేవీరావుతో ముఖపరిచయం తప్ప ఎలాంటి తనకు ఎలాంటి లావాదేవీలు లేవని విజయసాయిరెడ్డి అన్నారు. తన అల్లుడి కుటంబ వ్యాపారంలో తాను జోక్యం చేసుకోనన్నారు విజయసాయి.
వైవీ సుబ్బారెడ్డి అల్లుడిగా మాత్రమే విక్రంరెడ్డి తెలుసని విజయసాయి అన్నారు. ఈ సందర్భంగా జగన్‌పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. కోటరీ మాటలు నమ్మకూడదని జగన్‌కు ఎన్నోసార్లు చెప్పానన్నారు. కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ వద్దకు తీసుకెళ్తారన్నారు. కోటరీకి దూరంగా ఉంటేనే జగన్‌కు భవిష్యత్ ఉంటుందన్నారు. మీ చుట్టూ ఉన్నవాళ్ల మాటలు వినకూడదని జగన్‌కు తాను చెప్పానన్నారు. మా నాయకుడిలోనే మార్పు వచ్చిందన్నారు. నాయకుడు అనే వాడు ఎవరి చెప్పుడు మాటలు వినకూడదన్నారు. ప్రలోభాలకు లొంగానని, భయపడ్డానని జగన్ అన్నారని.. తాను ఎక్కడా ఎవరి ప్రలోభాలకు లొంగలేదని విజయసాయిరెడ్డి అన్నారు. మళ్లీ వైసీపీ ఘర్ వాపసీ ఉండదని.. తాను ఇప్పుడే ఏ పార్టీలో చేరాలనుకోవడంలేదన్నారు. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అని ముందు నుంచీ చెప్తున్నానన్నారు.
