ఆంధ్రప్రదేశ్‌(Ap)లో సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కాంపై విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌(Ap)లో సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కాంపై విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. "ఏపీ లిక్కర్ స్కామ్‌(Ap Liquor Scam)లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను'' అని ట్వీట్ వేశారు.

అయితే విజయసాయి రెడ్డి విజయవాడ(vijayawada)లోని సిట్‌ కార్యాలయంలో సుమారు మూడు గంటల పాటు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ పాలసీ చర్చల కోసం హైదరాబాద్, విజయవాడలో జరిగిన రెండు సమావేశాల గురించి, వాటిలో పాల్గొన్న వ్యక్తుల గురించి, కిక్‌బ్యాక్‌(Kickbacks)ల గురించి SIT అధికారులు ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy)తాను కిక్‌బ్యాక్‌ల గురించి ఎలాంటి సమాచారం లేదని, డబ్బు లావాదేవీల గురించి తనకు తెలియదని చెప్పారు.

విజయసాయి రెడ్డి తన విచారణలో రాజ్ కసిరెడ్డిని కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. రాజ్ కసిరెడ్డి(Raj Kashireddy), వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా ఉన్నాడు, ఈ స్కాంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతను సిట్‌ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడు, ఇప్పటికే అతనిపై లుక్‌అవుట్ నోటీసు జారీ అయింది. రాజ్ కసిరెడ్డి ఇటీవల యూఎస్‌కు పారిపోయినట్లు సమాచారం.

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి వ్యక్తులను కూడా విచారిస్తోంది. మిథున్ రెడ్డి (Mithun Reddy)ఇటీవల విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అడా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ( Ada Distilleries)వంటి కంపెనీలతో వీరి సంబంధాలను సిట్‌(Sit) పరిశీలిస్తోంది. ఈ స్కాం 2019-2024 మధ్య వైఎస్ఆర్‌సీపీ(Ysrcp) ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రూ.4,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. రాష్ట్ర ఖజానాకు రూ.18,860 కోట్ల నష్టం కలిగినట్లు టీడీపీ ఎంపీ లవు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu)ఆరోపించారు. కొత్త లిక్కర్ బ్రాండ్లు, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు, క్యాష్ లావాదేవీలు, కిక్‌బ్యాక్‌ల ద్వారా ఈ స్కాం జరిగినట్లు సిట్‌ గుర్తించింది.

ehatv

ehatv

Next Story