తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్- ఏపీ సీఎం జగన్ కుమ్మక్కయ్యారంటూ తీవ్రంగా ఎండగట్టారు. వీరిద్దరూ కలిసి జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించలేదు. వైసీపీ నేతలు కూడా విరుచుకుపడలేదు. అయితే వైసీపీ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు విజయ సాయి […]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్- ఏపీ సీఎం జగన్ కుమ్మక్కయ్యారంటూ తీవ్రంగా ఎండగట్టారు. వీరిద్దరూ కలిసి జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించలేదు. వైసీపీ నేతలు కూడా విరుచుకుపడలేదు. అయితే వైసీపీ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి మాత్రం ఏకంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేసారు.

పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం విభజించిందని అన్నారు. తెలంగాణ ఇచ్చాం... రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని విజయసాయి చెప్పుకొచ్చారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు నానా బాధలు పడిన కాంగ్రెస్ ఎట్టకేలకు అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదని, ప్రభుత్వం కూలిపోవడం తథ్యమని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేనంత నష్టం కలుగజేసిందని, అందుకే 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల చేసిన మోసానికి ఆ శిక్ష పడిందని, కాంగ్రెస్ కు ఈ శిక్ష సరిపోదని, ఇంకా శిక్ష పడాలని అన్నారు. ఏపీ పాలిట అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారని, కాంగ్రెస్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశానికి ఎందుకు స్థానం కల్పించలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం చేతకాని కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు తమను ఎందుకు నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వైఎస్ జగన్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అంటూ తెలంగాణ నేతలు, ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పాగా వేయాలని ప్రయత్నిస్తూ ఉంది. వైఎస్ షర్మిలను కూడా రంగంలోకి దింపింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు కాంగ్రెస్ పార్టీ పై అటాక్ మొదలు పెట్టారు.

Updated On 5 Feb 2024 9:42 PM GMT
Yagnik

Yagnik

Next Story