చెట్లు(Tree) నీళ్లను పీల్చుకుంటాయి. అలాగే అప్పుడప్పుడు జలధారలను కూడా కురిపిస్తుంటాయి. లేటెస్ట్‌గా అలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి(Godavari) జిల్లా పరిధిలోని పాపికొండల్లో(Papikondalu) కింటుకూరు అనే అటవీ ప్రాంతం ఉంది.
చెట్లు(Tree) నీళ్లను పీల్చుకుంటాయి. అలాగే అప్పుడప్పుడు జలధారలను కూడా కురిపిస్తుంటాయి. లేటెస్ట్‌గా అలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి(Godavari) జిల్లా పరిధిలోని పాపికొండల్లో(Papikondalu) కింటుకూరు అనే అటవీ ప్రాంతం ఉంది. ఆ అడవిలో ఉన్న నల్లమద్ది చెట్టు(black tree) నుంచి నీరు వస్తున్నదని అటవీశాఖ అధికారులు గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. దాంతో ఉన్నతాధికారులు సమక్షంలో నల్లమద్ది చెట్టుకు గొడ్డలితో రంధ్రం చేశారు. అంతే నీళ్లు ఉబికి వచ్చాయి. చెట్టు నుంచి 20 లీటర్ల వరకు నీళ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు.