Venkaiah Naidu : ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది
ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. గుంటూరు(Gunturu)లో డాక్టర్ కాసరనేని సదాశివరావు(Dr.Kasaraneni Sadasiva Rao) శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మనం ఏం చేయలేం అనుకో కూడదు.. అందరూ కలిసి చెడును కడిగేయాలి..

Venkaiah Naidu
ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. గుంటూరు(Gunturu)లో డాక్టర్ కాసరనేని సదాశివరావు(Dr.Kasaraneni Sadasiva Rao) శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మనం ఏం చేయలేం అనుకో కూడదు.. అందరూ కలిసి చెడును కడిగేయాలి.. మహనీయులను ఎన్నుకోవాలి.. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సదాశివరావు లాంటి డాక్టర్ లు ప్రజా సేవ కోసమే వైద్య వృత్తి లో కొనసాగారని అన్నారు. రాజకీయాల్లో కూడా సదాశివరావు తనదైన శైలిలో సామాన్యులకు అందుబాటులో ఉన్నారని తెలిపారు.
ఇప్పటి హాస్పిటల్లో ఫీజులు మాత్రమే పరమావధితో వైద్యం చేస్తున్నారని అన్న అపవాదు ఉంది.. దాని నుండి వైద్య రంగం బయట పడాలన్నారు. కులం, డబ్బు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారు.. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలన్నారు. చట్ట సభలు ప్రజలకు మేలు చేసే దేవాలయాలు.. వాటిని ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడుకోకూడదన్నారు. కులం చూసి కాదు.. గుణం చూసి ఓటు వేయండని పిలుపునిచ్చారు.
