గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం గురువారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలతో సత్కరించనున్న వ్యక్తుల పేర్లను ప్రకటించారు.

గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా కేంద్రం గురువారం పద్మ అవార్డు(Padma Awards)లను ప్రకటించింది. ఇందులో భాగంగా పద్మవిభూషణ్(Padma Vibhushan), పద్మభూషణ్(Padma Bhushan), పద్మశ్రీ(Padma Sri)లతో సత్కరించనున్న వ్యక్తుల పేర్లను ప్రకటించారు. ఈసారి 132 పద్మ అవార్డులను రాష్ట్రపతి(President) ఆమోదించారు. గురువారం రాత్రి విడుదల చేసిన జాబితాలో ఐదుగురిని పద్మ విభూషణ్, 17 మందిని పద్మ భూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వ‌రించాయి. అవార్డు పొందిన వారిలో 30 మంది మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఎనిమిది మంది విదేశీయులు, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ కేటగిరీ వ్యక్తులు ఉన్నారు. తొమ్మిది మందికి మరణానంతర అవార్డులను కూడా ప్రకటించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కుర్పారీ ఠాకూర్‌కు భారతరత్న(Bharata Ratna) ప్రదానం చేస్తున్నట్లు జనవరి 23న ప్రభుత్వం ప్రకటించింది. పద్మవిభూషణ్ అందుకున్న ప్రముఖుల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), ప్రముఖ నటి వైజయంతిమాల బాలి, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు దివంగత బిందేశ్వర్ పాఠక్, మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi), భారతీయ శాస్త్రీయ భరతనాట్యం నృత్యకారిణి పద్మా సుబ్రమణ్యం ఉన్నారు. పద్మ అవార్డుల ప్రకటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా అవార్డులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated On 25 Jan 2024 9:07 PM GMT
Yagnik

Yagnik

Next Story