Vellampalli Srinivas : టీడీపీ ఆఫీస్‌కు రమ్మన్నా సిద్ధమే.. చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు వెల్లంపల్లి సవాల్
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

Vellampalli Srinivas challenge to Chandrababu, Lokesh and Pawan
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ(Viajayawada West) నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్(Vellampalli Srinivas) నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులకు నేనేమి చేసానో చర్చకు సిద్ధంగా ఉన్నాను. టీడీపీ ఆఫీస్(TDP Office)కు రమ్మన్నా కూడా నేను సిద్ధమే అని చంద్రబాబు(Chandrababu), లోకేష్(Lokesh), పవన్(Pawan) లకు ఛాలెంజ్(Challenge) విసిరారు. ఆర్య వైశ్య సంఘాల ముసుగులో నన్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
చంద్రబాబు ఎప్పుడూ ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. జగన్ సీఎం అయ్యాక అనేక రాజకీయ, నామినేటెడ్ పదవులిచ్చారని వివరించారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలకు పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కార్తీక పౌర్ణమి స్నానాల కోసం వేలాది మంది భక్తులు వచ్చే చోట వారికి ఇబ్బంది కలిగేలా కార్యక్రమం తలపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులని మండిపడ్డారు.
టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ(BJP) పట్టించుకోలేదన్నారు. ఆర్యవైశ్యులకు పెద్ద పీట వేస్తుంది సీఎం జగన్(CM Jagan) అన్నారు. గతంలో ఆర్యవైశ్యులను చంద్రబాబు ఎందుకు పట్టించు కోలేదని ప్రశ్నించారు. చింతామనీ నాటకం జీవో రద్దు, వాసవి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది సీఎం జగన్ అని వివరించారు.
మీరా నన్ను విమర్శించేది.. చందాల కోసం ఆర్యవైశ్యుల ముసుగులో రాజకీయ డ్రామాలాడతారా అని నిప్పులు చెరిగారు. ఎంతమంది కలిసి వచ్చినా నా చిటికిన వేలు వెంట్రుక కూడా పీకలేరన్నారు. విజయవాడ పశ్చిమ టిక్కెట్ వైశ్యులకే ఇచ్చే దమ్ము లోకేష్ కి ఉందా? అని ప్రశ్నించారు. పోతిన మహేష్ కు సిగ్గు లేకుండా చంద్రబాబుకి చంచాగిరి చేస్తున్నాడని విమర్శించారు. నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ని పెట్టలేని దద్దమ్మలు నాకు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
