Vasireddy Padma; టీడీపీతో బేరం మాట్లాడుకున్న వాసిరెడ్డి పద్మ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార పదవులు అనుభవించిన వారిలో చాలా మంది ఆ పార్టీ ఓడిపోగానే అధికారపార్టీలోకి జంపయ్యారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార పదవులు అనుభవించిన వారిలో చాలా మంది ఆ పార్టీ ఓడిపోగానే అధికారపార్టీలోకి జంపయ్యారు. ఇలాంటి అవకాశవాదుల జాబితాలో వాసిరెడ్డి పద్మ కూడా చేరారు. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(Ys JaganMohanReddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాసిరెడ్డి పద్మ( Vasireddy Padma)మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా అధికారభోగాలు అనుభవించారు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీని, ఆ పార్టీ అధినేతను తీవ్రంగా విమర్శించారు. అలాంటి నాయకురాలు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp)కి రాజీనామా చేశారు. ఇంతకాలానికి తెలుగుదేశంపార్టీ(TDP)లో చేరాలని నిర్ణయించుకున్నారు. తాజాగా విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్నితో సమావేశమైన తర్వాత వాసిరెడ్డి పద్మ పార్టీలో చేరడం ఖరారైంది. ఎప్పుడైతే తెలుగుదేశంపార్టీలో చేరడం కన్‌ఫామ్ అయ్యిందో ఆ క్షణమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(ChandrababuNaidu)పై విజయసాయిరెడ్డి(Vijay Sai reddy) చేసిన విమర్శలకు వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. పార్టీ సారథ్యాన్ని జగన్మోహన్‌రెడ్డి వదిలేసుకుని విజయమ్మ(Ys Vijayamma)కు అప్పగించాలని పద్మ చెబుతూ ఇంకేదో మాట్లాడారు. అంటే టీడీపీలో చేరడానికి ముందు నుంచే చంద్రబాబును ప్రొటెక్ట్ చేయడం మొదలు పెట్టారు పద్మ. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న పద్మ ఎన్నికల సమయంలో అసెంబ్లీ టికెట్ ఆశించారు. అది కుదరకపోయే సరికి ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. పార్టీ విజయం కోసం కొంచెం కూడా ప్రయత్నించలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు పద్మ జనసేన పార్టీ(Janasena)లో చేరారేమోనని అనుకున్నారంతా! ఆ సమయంలో ఆమె టీడీపీలో చేరాలా? జనసేనలో చేరాలా? అన్నది తేల్చుకోలేకపోయారు. ఇంతకాలానికి ఆమె టీడీపీలో చేరాలని డిసైడయ్యారు. ఇకపై వాసిరెడ్డి పద్మతో ప్రతి రోజు జగన్‌ను తిట్టిస్తారేమో చంద్రబాబు!