వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohana Ranga) త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే రాధా(MLA Radha) పెళ్లి వార్త‌లు(Marriage) వైర‌ల్ అవుతున్నాయి. న‌ర్సాపురానికి(Narsapuram) చెందిన రాజ‌కీయ నాయ‌కుడి కూతురితో వంగ‌వీటి రాధ‌ వివాహం నిశ్చ‌య‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నెల 19న నర్సాపురంలో నిశ్చితార్థం..

వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohana Ranga) త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే రాధా(MLA Radha) పెళ్లి వార్త‌లు(Marriage) వైర‌ల్ అవుతున్నాయి. న‌ర్సాపురానికి(Narsapuram) చెందిన రాజ‌కీయ నాయ‌కుడి కూతురితో వంగ‌వీటి రాధ‌ వివాహం నిశ్చ‌య‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నెల 19న నర్సాపురంలో నిశ్చితార్థం.. వ‌చ్చే నెల 6వ తేదీన రాధా వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్లు వైర‌ల్ అవుతున్న వార్త‌ల ద్వారా తెలుస్తోంది. రాధా పెళ్లి వార్తల‌పై వంగవీటి అభిమానులు మాత్రం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వైర‌ల్ అవుతున్న‌ వార్త‌ల‌లో వాస్త‌వ‌మెంతో తెలియాల్సివుంది.

వంగవీటి రాధా 1968లో జ‌న్మించారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో కాంగ్రెస్‌ను వీడిన రాధా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం నుంచి పోటీచేసి 2009 ఎన్నిక‌ల‌లో ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి నుంచి రాధా రాజ‌కీయాల‌లోనే ఉన్నారు. అయితే అసెంబ్లీలో మాత్రం మ‌రోసారి అడుగుపెట్టే అవ‌కాశం రాలేదు. ప్ర‌స్తుతం తెలుగు దేశంలో ఉన్న రాధా జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

Updated On 16 Aug 2023 6:27 AM GMT
Ehatv

Ehatv

Next Story