వంగవీటి రాధా(Vangaveeti Radha Krishna) పెళ్లికి(Wedding) ముహూర్తం కుదిరింది. గతంలో చెప్పినట్లుగానే అక్టోబర్ నెలలో రాధా, పుష్పవల్లిలు(Pushpavalli) వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు.. విజయవాడలో(Vijayawada) పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. రాధ
మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohan Ranga) తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

వంగవీటి రాధా(Vangaveeti Radha Krishna) పెళ్లికి(Wedding) ముహూర్తం కుదిరింది. గతంలో చెప్పినట్లుగానే అక్టోబర్ నెలలో రాధా, పుష్పవల్లిలు(Pushpavalli) వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు.. విజయవాడలో(Vijayawada) పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. రాధ
మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohan Ranga) తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 22న (ఆదివారం) రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నంలో ముహూర్తం ఖాయం చేశారు. ఈ పెళ్లి వేడుక విజయవాడ – నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళి రిసార్ట్స్‌లో జరుగనుంది. ఈ మేరకు శుభలేఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 22న రాధ, పుష్పవల్లిలు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఇప్పటికే శుభలేఖల్ని ఇరువైపుల వారు అతిథులకు అందిస్తున్నారు. వంగవీటి రాధ, పుష్పవల్లి వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది.ఈ వివాహ వేడుకకు రంగా, రాధా అభిమానులతో పాటూ రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వంగవీటి రాధాకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంనకు చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె పుష్పవల్లితో నిశ్చితార్థం జరిగింది. పుష్పవల్లి నరసాపురంలోనే చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించి.. కొంతకాలం హైదరాబాద్‌లో యోగా టీచర్‌గా పనిచేవారు. ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు.పుష్పవల్లి కూడా రాజకీయ కుటుంబానికి చెందినవారే.

పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాణి 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమె తండ్రి గతంలో నరసాపురం టీడీపీలో కీలక నేతగా ఉన్నారు.అయితే ఈ కుటుంబం కొంతకాలం హైదరాబాదులో నివాసం ఉన్నారు. మళ్లీ ఇటీవల నరసాపురంలో నూతనంగా ఇల్లు నిర్మించి ఇక్కడే నివాసం ఉంటున్నారు. జక్కం బాబ్జీ ఇటీవల జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా నరసాపురం వచ్చి.. వీరి ఇంట్లోనే బస చేశారు. ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా.. వంగవీటి రాధా వీరి నివాసంలో వేడుకలు నిర్వహించారు. మొత్తానికి ఈ నెల 22న వంగవీటి రాధ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీ(Congress) తరఫున 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన 2009లో ప్రజారాజ్యంలో చేరి.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాలతో రాధా వైఎస్సార్‌సీపీలో చేరారు.. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేశారు.. టీడీపీ అభ్యర్థి గద్దే రామ్మోహన్ చేతిలో ఓడారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన ఆయన.. పోటీకి దూరంగా ఉన్నారు.. టీడీపీ అభ్యర్థుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం మాత్రం చేశారు.

2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి రాధా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారని చెప్పాలి. కొద్ది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌‌ను కలవడంతో జనసేన పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అలాగే అమరావతి రైతుల ఉద్యమానికి రాధా మద్దతు తెలిపారు. రాధా ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నా సరే ఆయన మాత్రం పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రెండు, మూడుసార్లు పాల్గొన్నారు. మరి రాధా 2024 ఎన్నికలనాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది.

Updated On 8 Oct 2023 1:45 AM GMT
Ehatv

Ehatv

Next Story