గత కొంత కాలంగా వంగవీటి రాధ జనసేన పార్టీలో చేరుతున్నారని తెగ చెక్కర్లు కొడుతున్నది ...అయితే ఇప్పుడు ఈ వార్తకు చెక్ పడింది... టీడీపీలో అసంతృప్తిగా కనిపిస్తున్న వంగవీటి రాధా త్వరలో జనసేన పార్టీ లో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారానికి ఈరోజు లోకేష్ తో పాదయాత్ర చెక్ పెట్టినట్లయింది. టీడీపీలో ఉన్నప్పటికీ గత కొంత కాలంగా ఆ పార్టీతో..పార్టీ కార్యాక్రమాల్లో పట్టనట్లుగా ఉంటున్న వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారన్న ప్రచారం […]

గత కొంత కాలంగా వంగవీటి రాధ జనసేన పార్టీలో చేరుతున్నారని తెగ చెక్కర్లు కొడుతున్నది ...అయితే ఇప్పుడు ఈ వార్తకు చెక్ పడింది... టీడీపీలో అసంతృప్తిగా కనిపిస్తున్న వంగవీటి రాధా త్వరలో జనసేన పార్టీ లో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారానికి ఈరోజు లోకేష్ తో పాదయాత్ర చెక్ పెట్టినట్లయింది. టీడీపీలో ఉన్నప్పటికీ గత కొంత కాలంగా ఆ పార్టీతో..పార్టీ కార్యాక్రమాల్లో పట్టనట్లుగా ఉంటున్న వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగానే సాగింది. అంతేకాదు ఈ నెల 14న మచిలీపట్నంలో జరిగే జనసేన ఆవిర్బావ సభలో రాధా ఆ పార్టీలో చేరతారు అని చాలామంది అనుకున్నారు . అయితే టీడీపీ యువనేత నారా లోకేష్ పీలేరు నియోజకవర్గంలో చేస్తున్న యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా దర్శనమిచ్చారు. లోకేష్ తో కలిసి కాసేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్ర విరామంలో ఆయనతో భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలోనే ఆయన కొనసాగుతున్నట్లు నిర్దారించారు . అయితే లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గొనడంతో టీడీపీ శ్రేణులు కూడా సంతోషం వ్యక్తం చేశాయి. ఇవాళ ఈ పాదయాత్రలో లోకేష్ తోనే రాధా ఉండబోతున్నట్లు సమాచారం .

లోకేష్ ను పాదయాత్రలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన వంగవీటి రాధా... ముందుగా లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో లోకేష్ కూడా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం లోకేష్ తో పాదయాత్రలో వంగవీటి రాధ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే విషయంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. రాధాతో చంద్రబాబు నేరుగా ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది . ఇప్పుడు లోకేష్ పాదయాత్రలోనే కలిసి నడవడంతో పార్టీ మారబోతున్నారనే వార్తలకు శుభం కార్టు పడ్డట్లు అయ్యింది.

Updated On 7 March 2023 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story