Vanga Geeta : స్వతంత్ర అభ్యర్థిగా వంగా గీత!
జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) హోమ్ వర్క్ చేయడం ఇష్టం లేనట్టుగా ఉంది. వేలకు వేలు పుస్తకాలు చదివిన పవన్ ఏపీ పాలిటిక్స్‌లో ఎవరేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో తనమీద పోటీలో ఉన్న ప్రత్యర్థులను జనసేనలోకి రావాలంటూ కోరుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్‌ను వంగ గీత(Vanga Geeta) జడిపిస్తున్నారు.
జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) హోమ్ వర్క్ చేయడం ఇష్టం లేనట్టుగా ఉంది. వేలకు వేలు పుస్తకాలు చదివిన పవన్ ఏపీ పాలిటిక్స్‌లో ఎవరేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో తనమీద పోటీలో ఉన్న ప్రత్యర్థులను జనసేనలోకి రావాలంటూ కోరుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్‌ను వంగ గీత(Vanga Geeta) జడిపిస్తున్నారు. ఆమెను జనసేనలో చేరాలని కోరుకుంటూనే ఆమె ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారంటూ ఓ తప్పుడు ప్రచారం చేస్తున్నారు పవన్. నిజానికి పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాక ముందు నుంచే వంగా గీత పాలిటిక్స్‌లో ఉన్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో విడుదలయ్యింది. అంతకు రెండేళ్ల ముందే వంగా గీత పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అప్పుడు ఆమె టీడీపీ తరఫున పోటీ చేసి ఉంటే కచ్చితంగా బ్రహ్మండమైన మెజారిటీతో విజయం సాధించి ఉండేవారు. మొదట వంగా గీతనే అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. కానీ టీడీపీలో ఉన్న వర్గపోరు కారణంగా ఆమెను అభ్యర్థిగా ప్రకటించినట్టు ప్రకటించి బీఫామ్ మాత్రం వెన్నా నాగేశ్వరరావుకు అందించింది. చంద్రబాబునాయుడు, బాలయోగి వంటి వారి అండదండలు పుష్కలంగా ఉన్నప్పటికీ గీతకు టికెట్ దొరకలేదు. అయితే ఆమె టికెట్ గ్యారంటీ అని అనుకుని నామినేషన్ వేశారు. తర్వాత బీ ఫారం కోసం ఆమె హైదరాబాద్‌లో ప్రయత్నాలు చేసుకున్నారు. అందుకే ఆమెకు నామినేషన్‌ను ఉపసంహరించుకునే వీలు చిక్కలేదు. టీడీపీ అధికారిక అభ్యర్థిగా వెన్నా నాగేశ్వర రావు గెలిచిన ఆ ఎన్నికలలో వంగా గీత స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉండాల్సి వచ్చింది. బ్యాలెట్ పేపర్‌లో అమె పేరు ఉన్నప్పటికీ గీత ఎలాంంటి ప్రచారమూ చేయలేదు. అయినా ఆమెకు 169 ఓట్లు రావడం విశేషం. అభ్యర్థిగా ప్రకటించి బీఫారం ఇవ్వకపోయినా ఆమె పెద్దగా ఫీలవ్వలేదు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ను చేశారు. తర్వాతి కాలంలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు సహచర కాపు నేతలతో ఆమె ఆ పార్టీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ సగానికి సగం ఖాళీ అయ్యింది. ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగా గీత తదనంతర కాలంలో చిరంజీవితో పాటుగా కాంగ్రెస్‌లోకి(Congress) వెళ్లారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఆమెకు నాలుగో పార్టీ అన్నమాట! పిఠాపురం నియోజకవర్గం బరిలో దిగడం ఆమెకు ఇది మూడోసారి!
సోమవారం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గీత కౌంటర్ ఇచ్చారు. పవన్‌ను తాను కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది ? అని అన్నారు.