Vallabhaneni Vamsi : జగన్ సీఎంగా ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుంది
ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా చేయలేని పనులు.. వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరన్నారు.

Vallabhaneni Vamsi Comments On CM Jagan
ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా చేయలేని పనులు.. వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరన్నారు. ఆరోగ్యశ్రీ(arogya Sri), ఫీజు రియంబర్స్ మెంట్(Fee Reimbursement) ద్వారా లక్షల మంది పేద కుటుంబాలలో వెలుగులు నింపిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. అదే బాటలో సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచారని పేర్కొన్నారు.
వృద్ధులు, వికలాంగులు ఏ నాయకుడు వద్ద పడిగాపులు పడకుండా 1వ తేదీన ఇంటివద్దనే పెన్షన్ అందిస్తున్నారని.. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళుగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపలేదన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులో కొన్ని అప్పులు చేయడం సహజం. గత ప్రభుత్వాలు అప్పులు చేయకుండా జేబులో డబ్బులు ఖర్చు చేశారా..? అని ప్రశ్నించారు. పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది పప్పు బెల్లాలు లాగా పెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ విధానాన్ని మార్చడం షావుకారులకు కడుపు మంటగా ఉందని అన్నారు.
కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా రాష్ట్రాన్ని అప్పులుపాలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడా కష్టం రాలేదు. కష్టం వచ్చింది కేవలం చంద్రబాబు(Chandrababu)కి మాత్రమేనన్నారు. ధనికుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదివితే ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే అర్ధం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని గ్రామాల్లో చెప్పి చేయలేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి(CM Jagan) ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.
