పిల్లలకు మంచి భవిష్యత్‌ కావాలంటే విద్య(Education) ఒక్కటే సరైన మార్గం. తమ బిడ్డ జీవితంలో బాగా చదువుకొని మంచిగా స్థిరపడాలని కోరుకుంటారు.
అయితే తమ చిన్నారులకు విద్యాభాసం కోసం తల్లిదండ్రులు మంచి ముహూర్తాలు చూసుకుంటారు. పంతుళ్లను సంప్రదించి ముహూర్తం చూసుకొని విద్యాభ్యాసం చేపిస్తుంటారు. ఈ ఏడాది పిల్లలను స్కూళ్లలో జాయిన్‌ చేసుకోవలనుకుంటే ఇప్పటి నుంచే స్కూళ్లను సంప్రదిస్తుండాలి.

పిల్లలకు మంచి భవిష్యత్‌ కావాలంటే విద్య(Education) ఒక్కటే సరైన మార్గం. తమ బిడ్డ జీవితంలో బాగా చదువుకొని మంచిగా స్థిరపడాలని కోరుకుంటారు.
అయితే తమ చిన్నారులకు విద్యాభాసం కోసం తల్లిదండ్రులు మంచి ముహూర్తాలు చూసుకుంటారు. పంతుళ్లను సంప్రదించి ముహూర్తం చూసుకొని విద్యాభ్యాసం చేపిస్తుంటారు. ఈ ఏడాది పిల్లలను స్కూళ్లలో జాయిన్‌ చేసుకోవలనుకుంటే ఇప్పటి నుంచే స్కూళ్లను సంప్రదిస్తుండాలి. అందుకు ఇప్పటి నుంచే చిన్నారులను విద్యాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

అయితే ఫిబ్రవరి 14న(14 February) వచ్చిన వసంత పంచమి(Vasantha Panchami) ఇందుకు మంచి ముహూర్తమని పండితులు చెప్తున్నారు. మాఘ శుక్ల పంచమి తేదీని పిల్లల అక్షరాభ్యాసం ప్రారంభించడానికి ఉత్తమ తేదీగా భావిస్తారు. దీనినే వసంత పంచమి అంటారు. సృష్టి ప్రారంభంలో ఈ తేదీన జ్ఞాన దేవత సరస్వతి ఆవిర్భవించిందని పురాణాలు చెప్తున్నాయి.. ఆమె తన వీణతో ప్రపంచానికి స్వరం ఇచ్చింది. సరస్వతీ దేవి అనుగ్రహం వల్ల మాత్రమే జ్ఞానం, చదువు లభిస్తుంది. దీంతో అక్షరాభ్యాసం చేయించడానికి వసంత పంచమి ఉత్తమ రోజు. ఫిబ్రవరి 14 అక్షరాభ్యాసం చేయించుకునేందుకు మంచి ముహూర్తం ఉందంటున్నారు. ఆరోజు 08:29 నుంచి 09:59 సమయం మధ్యలో మీ పిల్లలకు చదువు ప్రారంభించాలని సూచిస్తున్నారు. వాలెంటెన్స్‌ డే రోజే వసంత పంచమి రావడం కొంత ఆశ్చర్యం కల్గించినా.. ఎవరి పని వాళ్లదే అంటున్నారు.

Updated On 12 Feb 2024 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story