నరేంద్ర మోదీ(Narendra Modi) ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ పెడుతున్నారు.. ఎన్నికల ముందు మీకు బీసీలు గుర్తొచ్చారా..? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్(Congress) సీనియర్ నేత వీ హ‌నుమంత‌రావు(V Hanumanth Rao) మాట్లాడుతూ..

నరేంద్ర మోదీ(Narendra Modi) ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ పెడుతున్నారు.. ఎన్నికల ముందు మీకు బీసీలు గుర్తొచ్చారా..? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్(Congress) సీనియర్ నేత వీ హ‌నుమంత‌రావు(V Hanumanth Rao) మాట్లాడుతూ.. ఓబీసి(OBC) ఎంపీ కన్వీనర్ గా బీసీ ల కోసం కాంగ్రెస్ ఎంతో చేసింద‌న్నారు. IIT, IIM లో రిజర్వేషన్లు కావాలని కోర్టుకు వెళ్తే.. అవకాశం లేదని సుప్రీం కోర్టు(Supreme) చెప్పింది. సోనియా గాంధీని(sonia gandhi) కలిసి న్యాయం చేయాలని పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కోరామ‌న్నారు.

ఈరోజు వేలాది సంఖ్యలో డాక్టర్లు చదువుతున్నారంటే కాంగ్రెస్ కారణమ‌న్నారు. క్రిమిలేయర్ వల్ల కూడా వాళ్ళకే లాభం జరుగుతుందన్నారు. క్రిమిలేయర్ ఎత్తేయాలని ఎంపీలను కోరామ‌న్నారు. రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్ర.. తరువాత ఒబీసీల సమస్యలు తెలిశాయ‌న్నారు. ఓసీబీసీ కుల గణన చేయడానికి అంగీకరించారు.. హామీ ఇచ్చారని వెల్ల‌డించారు.

ఇప్పుడు మోదీకి బీసీల ఆత్మగౌరవం గుర్తొచ్చిందా అని ప్ర‌శ్నించారు. ఆంధ్రకి ప్రత్యేక హోదా కావాలని అడిగిన పవన్ కళ్యాణ్(Pawan kalyan).. ఇప్పుడు మోదీ పక్కన చేరారు.. పవన్ కళ్యాణ్ ని బీజేపీ(BJP) వాళ్ళు వాడుకుంటున్నారని అన్నారు. బీసీల‌ గురించి చెప్తున్న పవన్ కళ్యాణ్ కాపుకి చెందిన వారు.. ప్రైవేట్ ఇండస్ట్రీలలో రిజర్వేషన్స్ ఎందుకు అడగలేదని ప్ర‌శ్నించారు. మోదీ ఓబీసీ లకు చేసిన‌ మోసాన్ని గమనించాలని అన్నారు. కాంగ్రెస్ ఒక్కటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు

Updated On 7 Nov 2023 5:28 AM GMT
Ehatv

Ehatv

Next Story