ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Ap Deputy Cm Pawan Kalyan),హోమ్‌మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) పదే పదే మిస్సింగ్‌ కేసుల గురించి మాట్లాడుతుంటారు.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Ap Deputy Cm Pawan Kalyan),హోమ్‌మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) పదే పదే మిస్సింగ్‌ కేసుల గురించి మాట్లాడుతుంటారు. ఇంతకు ముందు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (YS Jagan)ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పుడు పవన్‌ కల్యాణ్‌ అసత్య ఆరోపణలు చేశారు. ఏపీలో 30 వేల మందికి పైగా అమ్మాయిలు అదృశ్యమయ్యారని, వీరిని వాలంటీర్లే (Volunteers)రాష్ట్రాన్ని దాటించారని చెప్పారు. వారందరిని గుర్తించి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కూటమిలో టీడీపీ(TDP), జనసేనల(Janasena)తో పాటు బీజేపీ(BJP)కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా పవన్‌ అదే మాట చెబుతున్నారు. మిస్సింగ్‌ అయినవారిని వెనక్కి రప్పిస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. పవన్‌కు తోడు హోంమంత్రి అనిత ఒకరు. ఆమె ప్రమాణం చేసిన క్షణం నుంచే అనిత ఇలాంటి విమర్శలే చేస్తూ వస్తున్నారు. అయితే పవన్‌, అనిత చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల పై లోక్‌సభ(Loksabha)లో తెలుగుదేశంపార్టీ ఎంపీలు లావు కృష్ణదేవరాయ(Lavu Sri Krishna Devarayalu), బీకే పార్థసారథిలు(BK Pardhasaradhi) ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)ఇచ్చిన సమాధానం టీడీపీకి షాకిచ్చింది. అయిదేళ్లలో అదృశ్యమైన వాళ్లలో కేవలం 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉన్నట్టు బండి సంజయ్‌ చెప్పడంతో పవన్‌, అనిత గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. తమ మిత్రపక్షమైన బీజేపీ సభ్యుల నుంచి ఇలాంటి సమాధానం వారు ఊహించి ఉండరు.

ehatv

ehatv

Next Story