Mansukh Mandaviya : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై కేంద్ర మంత్రి ప్రశంసలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగుందంటూ.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనిని ప్రత్యేకంగా అభినందించారు.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ(AP Health Department) పనితీరు బాగుందంటూ.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్(CM Jagan), రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని(Minister Vidudala Rajini)ని ప్రత్యేకంగా అభినందించారు. ఆరోగ్య రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని.. ఆరోగ్య రంగంలో ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని.. ఆరోగ్యవంతమైన ప్రజలతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విజయవాడ జీజీహెచ్(Vijayawada GGH) లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఆరోగ్యకరమైన సమాజం దేశాన్ని సమృద్ధిగా మారుస్తుంది అని ఆయన అన్నారు. ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో 10 రకాల టెస్టులు జరుగుతాయని అన్నారు. ఆసుపత్రులు కట్టినా డాక్టర్లు ఉండాలని మెడికల్ కాలేజీ(Medical Colleges)లు తీసుకొచ్చామని మాండవీయ చెప్పారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ,ప్రైవేటు మెడికల్ కళాశాలలో లక్షా ఏడు వేల సీట్లు దేశంలో ఉన్నాయన్నారు. 3 నుంచీ 4 లక్షలు టెలి కన్సల్టేషన్లు దేశం అంతా జరుగుతున్నాయి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందని చెప్పుకొచ్చారు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటించారు. విజయవాడలో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఓల్డ్ జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్(Critical Care Black), BSL-3 ల్యాబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి విడదల రజినితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.