Union Budget 2025: కేంద్ర బడ్జెట్లో ఏపి కి మళ్ళీ టోపీ.
బీహార్‌కి ఫుల్.. ఏపీకి మాత్రం నిల్
బీహార్‌కి ఫుల్.. ఏపీకి మాత్రం నిల్
సెంట్రల్ బడ్జెట్‌లో ఏపీ ఊసే ఎత్తని కేంద్రం.. బీహార్‌కి మాత్రం ప్యాకేజీలు
కేంద్రంపై కనీసం నోరెత్తని టీడీపీ, జనసేన నేతలు
గత 10 సంవత్సరాలుగా ప్రతి కేంద్ర బడ్జెట్లో ఏపి కి అన్యాయం చేసినట్లుగానే ఈ సారి బడ్జెట్లో కూడా మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది.
రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు చేస్తామని బడ్జెట్ సందర్భంగా చెప్పలేదు.
విభజన చట్టం లో సెక్షన్ 46 ప్రకారం రాయలసీమ కు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు విడుదల చేయాలి.కానీ బడ్జెట్లో కేటాయించ లేదు.
విభజన చట్టం లో 13 వ షెడ్యూల్ ప్రకారం కడప జిల్లాలో SAIL ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలి.దీని గురించి బడ్జెట్ లో ప్రస్తావించ లేదు.
విభజన చట్టం లో 13 వ షెడ్యూల్ ప్రకారం దుగరాజ పట్నం ఓడరేవు ను కేంద్రం నిర్మించాలి.దీని గురించి బడ్జెట్ లో ప్రస్తావించ లేదు.
విభజన చట్టం ప్రకారం విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులను కేంద్రం నిర్మించాలి.దీని గురించి బడ్జెట్ లో ప్రస్తావించ లేదు.
విభజన చట్టం లో సెక్షన్ 90 ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు.దీనిని 45.72 మీటర్ల(150అడుగులు) ఎత్తులో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి.ఎప్పుడో పూర్తి అయివుండాలి.41.15 మీటర్లు(135అడుగులు) ఎత్తులో నిర్మిస్తామని బడ్జెట్ లో చెప్పడం శోచనీయం,ఆ ఎత్తులో నిర్మిస్తే కేవలం బ్యారేజి గా మిగిలిపోతుంది.
విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధానిలో రాజ్ భవన్,సచివాలయం,హైకోర్టు,అసెంబ్లీ భవనాల నిర్మాణానికి,మౌలిక సదుపాయాలకు గ్రాంట్ ఇవ్వాలి. దీలి గురించి బడ్జెట్ లో ప్రస్తావించ లేదు.
కేంద్రం లో,రాష్ట్రంలో డబులింజన్ ప్రభుత్వం వుండి కూడా రాష్ట్రానికి ఇంత అన్యాయం జరగడం శోచనీయం.