ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) మార్గదర్శి(Margadarsi)వ్యవహారంలో స్పందించిన తీరు అన్యాయంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌(Ex Mp Undvalli Arun Kumar) ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) మార్గదర్శి(Margadarsi)వ్యవహారంలో స్పందించిన తీరు అన్యాయంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌(Ex Mp Undvalli Arun Kumar) ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారని అన్నారు. మార్గదర్శి కేసు విషయంలో బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తారని అనుకున్నానని, కానీ అలా జరగలేదని ఉండవల్లి తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(Ys Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను చంద్రబాబు ప్రభుత్వం విత్ డ్రా చేసేయటం అత్యంత దారుణమని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడతారని అనుకున్నానని, అలాగే జరిగిందన్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పని వ్యాఖ్యానించారు. డిపాజిట్లు విషయంలో ఫ్యూచర్ సబ్‌ స్క్రిప్షన్‌ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉన్నా మార్గదర్శి ఫ్యూచర్ సబ్ స్క్రిప్షన్ కొనసాగించిందని తెలిపారు. 'ఒకవేళ మార్గదర్శికి సహాయం చేయాలనుకున్నా... చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదు.చంద్రబాబు చరిత్రలోనే ఇదో అతిపెద్ద మచ్చగా నిలిచిపోతుంది. అయినా కేసు ఆగే పరిస్థితి లేదు..కేసు కొనసాగుతుంది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఉండవల్లి అన్నారు.

'చంద్రబాబు నాయుడు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారు. ఎన్నికల అఫిడవిట్‌లో 900 కోట్ల రూపాయలు తన ఆసెట్ గా చంద్రబాబు చూపారు. చంద్రబాబు భార్య రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర తమ ఆస్తి 25 వేల కోట్లు ఉన్నట్టు చూపారు. చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్టు ఎవరు ఫిర్యాదు చేయలేదు' అని ఉండవల్లి చెప్పుకొచ్చారు. మార్గదర్శి చేసిన పని తప్పేనని రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ ఇప్పటికే ఫైల్ చేసిందని, చిట్‌ఫండ్‌ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నా మార్గదర్శి అనేక వ్యాపారాలు చేసిందని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. కేవలం ప్రజలు డబ్బుతోనే రామోజీరావు వ్యాపారాలు అన్నీ చేశారని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ehatv

ehatv

Next Story