రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమి కట్టాల్సి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) ఎంతగా చెప్పుకుంటున్నా, ఆయన ఆంతర్యమేమిటో ప్రజలందరికీ తెలుసు. ఎలాగైనా సరే, జగన్‌(YS Jagan)ను గద్దెదింపడమే చంద్రబాబు తక్షణావసరం! జనసేన, బీజేపీలతో చంద్రబాబు కూటమి అయితే కట్టారు కానీ పర్యవసానాలను ఆలోచించుకోలేకపోయారు. ఆ ఫలితమే నియోజకవర్గాలలో అసమ్మతులు, అసంతృప్తులు పెరుగుతున్నాయి.

రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమి కట్టాల్సి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) ఎంతగా చెప్పుకుంటున్నా, ఆయన ఆంతర్యమేమిటో ప్రజలందరికీ తెలుసు. ఎలాగైనా సరే, జగన్‌(YS Jagan)ను గద్దెదింపడమే చంద్రబాబు తక్షణావసరం! జనసేన, బీజేపీలతో చంద్రబాబు కూటమి అయితే కట్టారు కానీ పర్యవసానాలను ఆలోచించుకోలేకపోయారు. ఆ ఫలితమే నియోజకవర్గాలలో అసమ్మతులు, అసంతృప్తులు పెరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం(Undi Constituency)లో అయితే ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. రోజుకో మలుపు తిరుగుతూ టీడీపీ క్యాడర్‌లో ఉత్కంఠ పెంచుతోంది. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు(MLA Ramaraju) పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధినేత చంద్రబాబునాయుడే స్వయంగా ప్రకటించారు. ఇది మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు(Kalavapudi Siva Rama Raju)ను బాధించింది. తనకు టికెట్‌ దొరక్కపోయేసరికి మనస్తాపానికి గురైన శివరామరాజు ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని డిసైడయ్యారు. ఇందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల ఉండిని పర్యటించిన చంద్రబాబు సమస్యకు పరిష్కారాన్ని కనుగొందామనుకున్నారు. తనతో మాట్లాడేందుకు రావాలని శివరామరాజుకు కబురుపెట్టారు. అయితే శివరామరాజు మాత్రం లైట్‌ తీసుకున్నాడు. తాను పోటీ చేయడం ఖాయమని, ఇక ఎవరు చెప్పినా వినేది లేదని స్పష్టం చేశారాయన! శివరామరాజుతోనే తలనొప్పులు వస్తుంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు(Raghurama Krishnam Raju)తో చంద్రబాబు మరిన్ని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. ఇటీవల తెలుగుదేశంపార్టీలో చేరిన రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అనుకుంటోందట!
రామ‌రాజును త‌ప్పించి, ర‌ఘురామ‌కృష్ణంరాజుకు టికెట్ ఇస్తార‌నే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు చంద్ర‌బాబు ప‌రోక్ష సంకేతాలు కూడా ఇచ్చారట! రామ‌రాజును తప్పించి , ర‌ఘురామ‌కృష్ణంరాజుకు టికెట్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. రామరాజు కూడా తాను బరిలోంచి తప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు. తాను పోటీలో ఉండటం ఖాయమని, టీడీపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను మాత్రం పోటీ చేసి తీరతానని తెలిపారు. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తిరుగుబాటు అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉండి టికెట్‌ రఘురామకృష్ణరాజుకు ఇస్తే రామరాజు కూడా శివరామరాజులా స్వతంత్రంగా పోటీ చేయవచ్చు. అంతిమంగా ఇది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కే లాభం!

Updated On 10 April 2024 1:38 AM GMT
Ehatv

Ehatv

Next Story