క్రాస్ ఓటింగ్‏కు పాల్పడ్డారన్న ఆరోపణలపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని (Undavalli Sridevi) వైసీపీ నుంచి సస్పెండ్ చేసింది పార్టీ అధిష్టానం, ఆమెతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే . సస్పెన్షన్ తర్వాత తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై అలాగే ఆమె ఇంటిపై వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేశారు. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరిగింది.

క్రాస్ ఓటింగ్‏కు పాల్పడ్డారన్న ఆరోపణలపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని (Undavalli Sridevi) వైసీపీ నుంచి సస్పెండ్ చేసింది పార్టీ అధిష్టానం, ఆమెతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే . సస్పెన్షన్ తర్వాత తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై అలాగే ఆమె ఇంటిపై వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేశారు. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరిగింది. అయితే ఆమె మీడియా ముందుకు వచ్చి ఎవ్వరు ఊహించని విధంగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ (CM Jagan), సజ్జల రామకృష్ణ రెడ్డిపై(Sajjala Ramakrishna Reddy) శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు, తన కుటుంబ సబ్యులకు ప్రాణహాని ఉందని.. తమకేమైనా జరిగితే సజ్జల రామకృష్ణ రెడ్డిదే బాధ్యత అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి దారితీసాయి. నిజంగానే శ్రీదేవికి ప్రాణహాని ఉందా.. ఆమె సజ్జలను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి.. అనేవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Updated On 27 March 2023 5:31 AM GMT
Ehatv

Ehatv

Next Story