స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌(Skill Development Scam)లో చిక్కుకుని అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రస్తుతం రాజమండ్రి జైలు(Rajahmundry Jail)లో ఉన్నారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నది చంద్రబాబు వాదన! అన్యాయంగా తమ నేతను అరెస్ట్‌ చేశారన్నది టీడీపీ శ్రేణుల భావన.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌(Skill Development Scam)లో చిక్కుకుని అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రస్తుతం రాజమండ్రి జైలు(Rajahmundry Jail)లో ఉన్నారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నది చంద్రబాబు వాదన! అన్యాయంగా తమ నేతను అరెస్ట్‌ చేశారన్నది టీడీపీ శ్రేణుల భావన. ప్రస్తుతం స్కిల్‌ స్కామ్‌పై ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి బలమైన సాక్షాలు సీఐడీ సంపాదించింది.

ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ కావడం, పక్క రాష్ట్రాలతో ఈ కేసుకు సంబంధాలు ఉండటంతో విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించాలన్నది సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌(Vundavalli Aruna Kumar) అభిప్రాయం. ఈ క్రమంలోనే ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉండవల్లి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసును ఈడీ, ఐటీ, సీఐడీ విచారిస్తున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తే సమగ్ర వివరాలు వెల్లడవుతాయని ఉండవల్లి తరఫు న్యాయవాది వాదించారు.

హై ప్రొపైల్ కేసు కావ‌డంతో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉందన్నది పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదన. భారీగా నిధులు ప‌క్క‌దారి మ‌ళ్లించిన‌ట్టు సీఐడీ ద‌ర్యాప్తులో తేలింద‌ని, కావున నిష్ప‌క్ష‌పాత ద‌ర్యాప్తు కోసం కేంద్ర విచార‌ణ సంస్థ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు.

ఈ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డంపై త‌మ‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ శ్రీ‌రామ్ సుప్రీం కోర్టుకు తెలిపారు. అంతేకాదు, స్కిల్ స్కామ్‌, పైబ‌ర్ నెట్‌, అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసుల‌ను సీబీఐతో విచారణ జరిపించాలంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని తాము ఎప్ప‌టి నుంచో కోరుతున్నామ‌ని సుప్రీంకు విన్నవించుకున్నారు.

సీబీఐకి కేసు విచార‌ణ‌ను అప్ప‌గించాల‌న్న అభిప్రాయంలో ప్ర‌భుత్వానికి రెండో మాటే లేద‌ని ఏపీ హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తివాదుల‌కు నోటీసులు ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. అలాగే విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.

అయితే కేసును సీబీఐకి అప్ప‌గించాల‌న్న నోటీసుల‌పై చంద్ర‌బాబునాయుడు రియాక్షన్‌ ఎలా ఉండబోతున్నదే ఆసక్తిగా మారింది. సీఐడీ విచారణ చాలంటారా? లేక సీఐడీ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కాబట్టి సీబీఐకి అప్పగించినా ఫర్వాలేదని చెబుతారా? ఒకవేళ
సీబీఐ విచార‌ణ‌కు హైకోర్టు ఆదేశిస్తే మాత్రం చంద్ర‌బాబు మరిన్ని కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు."Written By : Senior Journalist M.Phani Kumar"

Updated On 17 Oct 2023 6:42 AM GMT
Ehatv

Ehatv

Next Story