మే 11న నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా భారీగా జనం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు రావడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మెగా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తూ ఉండగా.. అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నేత కోసం నంద్యాల రావడంతో సోషల్ మీడియాలో కూడా భారీగా చర్చ జరిగింది. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని.. కేవలం తన స్నేహితుడి కోసం మాత్రమే వచ్చానని 'పుష్ప' స్టార్ చెప్పారు.

మే 11న నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా భారీగా జనం అల్లు అర్జున్ ను చూడడానికి వచ్చారు. భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్ , నాగరాజు వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అంత మంది జనసమీకరణ చేయడంపై ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఇక అల్లు అర్జున్‌ మీద కూడ కేసు నమోదైంది. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. శిల్పా రవి అల్లు అర్జున్‌కు ఫ్రెండ్‌ కావడంతో.. ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్‌ తన భార్యతో సహా ఆయన ఇంటికి వెళ్లారు.

Updated On 24 May 2024 9:59 PM GMT
Yagnik

Yagnik

Next Story