TTDP kasani gnaneshwar : రాధాకృష్ణకు కాసాని షాక్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) తెలుగుదేశంపార్టీ(TTDP) పోటీ చేయకూడదనేది కొంతమంది కోరిక! ఈ కోరిక ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు(Radha Krishna) విపరీతంగా ఉంది. ఇక చంద్రబాబు ప్రియ శిష్యుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి(Revanth Reddy) కూడా ఈ కోరిక గట్టిగానే ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) తెలుగుదేశంపార్టీ(TTDP) పోటీ చేయకూడదనేది కొంతమంది కోరిక! ఈ కోరిక ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు(Radha Krishna) విపరీతంగా ఉంది. ఇక చంద్రబాబు ప్రియ శిష్యుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి(Revanth Reddy) కూడా ఈ కోరిక గట్టిగానే ఉంది. వీరిద్దరు ఇంత బలంగా ఎందుకు కోరుకుంటున్నారంటే టీడీపీ బరిలో లేకపోతే కమ్మ సామాజికవర్గం ఓట్లన్నీ కాంగ్రెస్‌కు(Congress) పడతాయన్న అభిప్రాయం! చూడబోతే రాధాకృష్ణ కోరిక నెరవేరేట్టుగా లేదనిపిస్తోంది.
ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ కూడా రెడీ అవుతోంది. ఈ మాట ఆ పార్టీకి చెందిన తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరే(kasani gnaneshwar) చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నాయని, వాటిని నమ్మకూడదని కూడా కాసాని అన్నారు. అంటే పరోక్షంగా రాధాకృష్ణ రాతలనే ఆయన ప్రస్తావించారన్నమాట! ఆదివారం తన కొత్త పలుకులో(Kotha paluku) రాధాకృష్ణ ఏం రాశారంటే, 'ప్రస్తుతానికైతే సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం సెటిలర్లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలన్న నిర్ణయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సొంతంగా తెలంగాణలో పోటీ చేయకూడదని సెటిలర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే సెటిలర్ల ఓట్లు చీలి లక్ష్యం దెబ్బ తింటుందని ఈ వర్గం వాదిస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మొదటి నుంచీ సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. ఆయన అధికారంలోకి వస్తే చంద్రబాబుకు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని కూడా సెటిలర్లు భావిస్తున్నారు.
ఈ కారణంగానే పోటీలోకి దిగవద్దని సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి తెస్తోంది’ అంటూ రాసుకోచ్చారు. అయితే ఇటు రాధాకృష్ణకు, అటు రేవంత్‌రెడ్డికి షాక్‌నిస్తూ కాసాని ఓ ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా పోటీ చేస్తుందన్నారు. ఈ విషయంపై బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని రాజకీయపార్టీలు కూడా బుధవారం వెలువడే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. "Written By : Journalist M.Phani Kumar"